రెడ్ మీ ఎస్2 వచ్చేసింది.. ఫీచర్లు అదిరిపోయాయి

Xiaomi Redmi S2 with dual cameras, 18:9 display, 16-megapixel front camera launched
Highlights

షియోమి నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి తన నూతన స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ ఎస్2'ను కొంత సేపటి క్రితమే చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో భారత మార్కెట్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. కాగా సెల్ఫీ లవర్ల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను షియోమీ తయారు చేసింది. ఇందులో ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫ్లాష్ లైట్ సదుపాయం ఉండడం వల్ల సెల్ఫీలు క్వాలిటీతో వస్తాయి. ఈ ఫోన్‌లో 5.99 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. 

ఇక ఫోన్ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో రెండు సిమ్‌కార్డులు, ఒక మెమొరీ కార్డును వేసుకునే విధంగా వేర్వేరుగా 3 స్లాట్లను ఏర్పాటు చేశారు. ఇక ఫోన్ డిజైన్‌ను గతంలో వచ్చిన షియోమీ ఫోన్ల కన్నా పూర్తి భిన్నంగా ఆకట్టుకునే డిజైన్లు, కలర్స్‌తో తయారు చేశారు. గ్రే, రోజ్ గోల్డ్, షాంపేన్ గోల్డ్, ప్లాటినం సిల్వర్ రంగుల్లో విడుదలైన ఈ ఫోన్ 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.10,500, రూ.13,700 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. 


షియోమీ రెడ్‌మీ ఎస్2 ఫీచర్లు...

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.
 

loader