షియోమి నుంచి మరో కొత్త ఫోన్ మార్చి 14న భారత మార్కెట్లోకి

చైనాకి చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ తయారీ సంస్థ షియోమీ భారత్‌ మార్కెట్లో మరో మోడల్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ వారం ప్రముఖ ఈకామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌లో రెడ్‌మి 5 మొబైల్‌ను‌ ఎక్స్‌ క్లూజివ్‌గా విడుదల చేయబోతున్నారు. మరోవైపు షియోమీ తన వెబ్‌సైట్లో ఈ ఫోనుకు సంబంధించిన ఫీచర్స్‌ ను తెలిపేలా ‘కాంపాక్ట్ పవర్‌హౌస్‌’ అంటూ ఓ ఫొటోలో పేర్కొంది. ఇక అమెజాన్‌లో మార్చి 14న ఈ ఫోన్‌ విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుత సమాచారం ప్రకారం రెడ్‌మి 5 ఫీచర్స్‌ ఇలా ఉండే అవకాశం ఉంది. 5.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌, 2జీబీ/ 3జీబీ/ 4జీబీ ర్యామ్‌, 16జీబీ లేదా 32జీబీ ఇంటర్నల్ మెమొరీతో విడుదల చేసే అవకాశం ఉంది. వెనక వైపు 12ఎంపీ కెమెరా, ముందు వైపు 5 ఎంపీ కెమెరా అమర్చారు. 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ సదుపాయం కలదు. దీని ధర కూడా బడ్జెట్ ధరలో ఉండనుంది. రూ.9వేల లోపే ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.