ఓపెన్ సేల్ లో రెడ్ మీ5

Xiaomi Redmi 5 goes on open sale on Mi.com and Amazon for all variants
Highlights

ఇక నుంచి ఫ్లాష్‌సేల్‌ కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఎల్లప్పుడూ ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి రెడ్ మీ5 గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేసింది.ఇటీవల షియోమి భారత మార్కెట్లో రెడ్ మీ 5 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫ్లాష్ సేల్ లో ఈ ఫోన్ అమ్మకాలు చేపట్టగా.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కాగా.. ఫ్లాష్ సేల్ లో ఫోన్ లభించని వారంతా చాలా డిస్సాపాయింట్ అయ్యారు.దీంతో.. కష్టమర్ల కోరిక మేరకు రెడ్ మీ5 ఫోన్ కి ఓపెన్ సేల్ ప్రకటించింది షియోమి.

అమెజాన్‌.ఇన్‌, అమెజాన్‌ ఇండియా యాప్‌, ఎంఐ.కామ్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇక శాశ్వతంగా ఓపెన్‌ సేల్‌లో అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇక నుంచి ఫ్లాష్‌సేల్‌ కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఎల్లప్పుడూ ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

2జీబీ/ 16జీబీ, 3జీబీ/ 32జీబీ, 4జీబీ/ 64జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఓపెన్‌ సేల్‌లో ఉంటుంది. గోల్డ్‌, బ్లాక్‌, రోజ్‌ గోల్డ్‌, బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే వారికి అమెజాన్‌ కిండ్లీ ఈబుక్స్‌పై 90 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు 5 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌, రిలయన్స్‌ జియో నుంచి డేటా, రూ.2200 క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. 
 

loader