మరోసారి తగ్గిన రెడ్ మి4 ధర

First Published 15, Mar 2018, 3:33 PM IST
Xiaomi Redmi 4 gets Rs 500 price cut post Redmi 5 launch
Highlights
  • ధర తగ్గిన రెడ్ మీ 4 ఫోన్ ధర

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన రెడ్ మీ 4 ఫోన్ ధర మరోసారి తగ్గించింది. గతంలో ఒకసారి ఈ ఫోన్ ధర రూ.500 తగ్గించిన కంపెనీ.. తాజాగా మరోసారి ధర తగ్గించింది. ఈ ఫోన్ విడుదల చేసిన సమయంలో విపరీతంగా అమ్ముడైన సంగతి అందరికీ తెలిసిందే. అమ్మకాలను మరింత పెంచుకునేందుకు కంపెనీ ఇప్పుడు ఫోన్ ధరపై రూ.500 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ధర తగ్గింపు తర్వాత రెడ్‌మి 4 3జీబీ/32 జీబీ  స్టోరేజ్ ధర. రూ.8499గా ఉంటుంది. 4జీబీ/64జీబీస్టోరేజ్ వేరియంట్‌ రూ. 10499లకు అందుబాటులో ఉంటుంది. ఎంఐ.కామ్‌, అమెజాన్‌,  ఎంఐ హోమ్ స్టోర్లో ఈస్మార్ట్‌ ఫోన్‌ను  కొనుగోలు చేయవచ్చు.

రెడ్ మీ4 ఫోన్ ఫీచర్లు..

5 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే

1.4 ఆక్టాకోర్ ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 7.0

3జీబీ/32జీబీ స్టోరేజ్, 4జీబీ/64జీబీ స్టోరేజ్

128 జీబీ దాకా విస్తరించుకునే సౌకర్యం

13మెగాపిక్సెల్ వెనుక కెమేరా

5మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా

4100ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

 

loader