షియోమీ నుంచి ఇండియాకు మరొక ఆఫర్

Xiaomi planning to sell electric vehicles in India
Highlights

ఇండియాలో షియోమీ కొత్త  ప్రయోగం

ఇండియాలో సూపర్ హిట్టయిన చైనీస్ స్మార్ట్ ఫోన్  మేకర్ షియోమీ దేశంలో మరొక ప్రయోగం చేయాలనుకుంటున్నది. ఇపుడు ఎలెక్ట్రిక్ వాహనాలను కూడా తయారుచేసేందుకు సిద్ధమవుతూవుంది. షియోమీ 2014లో భారత్ లో స్మార్ట్ పోన్ తయారీ దారుగా ప్రవేశించింది. అంతకంటే ముఖ్యంగా ఈ కంపెనీయూనిట్ ఆంధ్రప్రదేశ్ ఉండటం, ఫోన్ ని వైజాగ్ నుంచి లాంచ్ చేయడం తెలుగు వాళ్లకు గర్వకారణం. ఇపుడు ఎలెక్ట్రిక్ వాహానాల తయారీ   కోసం రెగ్యులేటరీ ఫైలింగ్ చేసింది. రిజస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ ఒ సి) దగ్గిర సమర్పించిన సమాచారం ప్రకారం, ఈ కంపెనీ నాన్ బ్యాంకింగ్ కార్యకాలాపాలలోకి కూడా ప్రవేశించాలనుకుంటున్నది.  షియోమి ఇప్పటికే చైనాలో ఎలెక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తూ ఉంది. ఇందులో ఫోల్డబుల్  బైక్స్, ఎలెక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.భారత ప్రభుత్వం 2032 ఎలెక్రిక్ వెహికిల్ విజన్ ప్రకటించాక పలు కంపెనీలు ఎలెక్ట్రిక్ వాహానాలు తయారుచేసేందుకు ముందుకు వస్తున్నాయి. మహింద్ర, టాటా కార్లు తయారు చేయాలనుకుంటున్నాయ. స్కూటర్లు తయారుచేసే ప్రతిపాదన ఏదీ రాలేదు. షియోమీ యే ముందుకొచ్చింది.

 

ఇది కూడా చదవండి

సంక్రాంతి రద్దీ చూసి హీరో విశాల్ జడిసి పోయాడు

https://goo.gl/gzr7Zp

 

 

 

loader