చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి నుంచి మరో స్మార్ట్ టీవీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. భారత మార్కెట్లో షియోమి బ్రాండ్ కి డిమాండ్ ఎక్కువ. ఇటీవల షియోమి.. రెడ్ మీ నోట్5, రెడ్ మీ నోట్ 5 ప్రో పేరిట రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేయగా.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ రెండు ఫోన్ల విడుదల సమయంలోనే.. తొలిసారి స్మార్ట్ టీవీని భారత్ కి పరిచయం చేసింది.

కాగా.. తాజాగా మరో స్మార్ట్ టీవీని తీసుకురానున్నట్లు తెలిపింది. ఇప్పటికే చైనాలో విడుదల చేసింది. ఎంఐ టీవీ4ఏ పేరిట విడుదల చేస్తున్న ఈ ఫోన్ ధర భారత మార్కెట్లో రూ.17,500గా ఉండనుంది. మార్చి 7న మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. కాగా షియోమీ ఎంఐ టీవీ 4ఏ లో 40 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, వాయిస్ కంట్రోల్ సపోర్ట్, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, హెచ్‌డీఎంఐ, ఈథర్‌నెట్ పోర్టులు, డాల్బీ డీటీఎస్ ఆడియో, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.