చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. వినియోగదారుల కోసం వాలంటైన్ గిఫ్ట్ ప్రకటించింది. వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్ మీ 5 ఫోన్ ని ఫిబ్రవరి 14( ప్రేమికుల రోజు)న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. స్పెషల్ గా ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి మరి  ఫోన్ విడుదలకు ఏర్పాట్లు చేశారు. తొలుత ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఎక్స్‌ క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌ లోనే విక్రయానికి రానుంది. రెడ్‌మి ఫోన్‌ లాంచ్‌ ఈవెంట్‌ గురించి, ఈ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఓ బ్యానర్‌ను లిస్టు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ రెడ్‌మి నోట్‌ 5 ఈవెంట్‌ను షియోమి లైవ్‌ స్ట్రీమ్‌ చేయనుంది. 

లైవ్‌స్ట్రీమ్‌ కోసం యూజర్లు తమ షియోమి అకౌంట్‌తో ఎం.కామ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్‌ అవ్వాలి. లేదా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా కూడా వీక్షించవచ్చు. రెడ్‌మి నోట్‌ 5తో పాటు కంపెనీ తొలి టీవీని కూడా లాంచ్‌ చేస్తోందని తెలుస్తోంది. ఎంఐ టీవీ 4 పేరుతో దీన్ని మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. షియోమి లాంచ్‌ చేస్తున్న ఈ టీవీ 49 అంగుళాలు, 55 అంగుళాలు లేదా 65 అంగుళాలు ఉండబోతుందని టాక్‌.

రెడ్ మీ5 ఫోన్ ఫీచర్లు..

5.7ఇంచెస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.