ప్యాన్ ఫెస్టివల్ ప్రకటించిన షియోమి

Xiaomi Mi Fan Festival from April 2 to 6: Deals, Discounts, Bundle offers and more
Highlights

షియోమి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. భారత మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటుచేసుకుంది. అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందిస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటోంది. కాగా.. వినియోగదారులకు మరోసారి షియోమి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ పేరిట .. వినూత్న ఆఫర్ ని ప్రకటించింది.

నేటి నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేకమైన సేల్‌లో దాదాపు అన్ని రకాల షియోమి ఉత్పత్తులు విక్రయించబడడంతో పాటు Musical.ly సర్వీస్ నిర్వహించే ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయటం ద్వారా ఎంఐమ్యాక్స్ 2 ఫోన్ గెలుపొందే అవకాశముంది. అలాగే షియోమి గెలాక్సీ గేమ్ ని ఆడడం ద్వారా రెడ్ మీ5ఏ ఫోన్‌ని కూడా గెలుచుకోవచ్చు.

అయితే ఇంతకు ముందు జరిగిన ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ లలో మాదిరిగా ఈసారి కూపన్లు ఉచితంగా లభించవు. వీటిని పొందాలంటే ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ కి మీ మిత్రులను ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది, ఒక నిర్దిష్టమైన లైక్‌ల సంఖ్యకు చేరుకున్న తర్వాత మాత్రమే రెడ్ మీ వై1, రెడ్ మీ నోట్ 5, ఎంఐ బ్రాండ్ 2 వంటి ఉత్పత్తులపై డిస్కౌంట్లు లభిస్తాయి.

అలాగే స్మార్ట్ఫోన్లు. ఫిట్నెస్ బ్యాండ్ల వంటి చిన్నచిన్న ఉత్పత్తులు కొనుగోలు చేస్తే ఎంఐ వంటివి గెలుపొందే అవకాశం కూడా అందించబడుతోంది. దీనికిగాను ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల55 నిమిషాలకు మీ ఎంఐ ఎకౌంట్ లో లాగిన్ అయి ప్రతిరోజు మధ్యాహ్నం 1గంటకు జరిగే సేల్ పాల్గొనాలి.మీకు కావాల్సిన ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసి పేమెంట్ చేస్తే సరిపోతుంది. కొంతమంది లక్కీ కస్టమర్లను ఎంపిక చేసి టివిల వంటివి అందిస్తారు.

loader