పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్న షియోమి

మీకు పర్సనల్ లోన్ కావాలా..? ఏ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు కేవలం షియోమి మొబైల్ ఫోన్ వినియోగదారులైతే చాలు. సులభంగా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.
మీరు చదివింది నిజమే.. చైనాకి చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ షియోమి.. తన స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. షియోమీ ఫోన్లను వాడుతున్న వారికి రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నది. క్రెడిట్ బీ అనే సంస్థతో కలిసి షియోమీ కొత్తగా ఎంఐ క్రెడిట్ సర్వీస్ అనే ప్రాజెక్ట్‌ను ఇవాళే లాంచ్ చేసింది. ఇందులో భాగంగా షియోమీ స్మార్ట్‌ఫోన్ ఉన్న వినియోగదారులకు రూ.1000 నుంచి రూ.1 లక్ష వరకు లోన్లను ఇస్తున్నారు.

ఎంఐ క్రెడిట్ సర్వీస్‌లో షియోమీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ వివరాలను ముందుగా నమోదు చేసుకోవాలి. సింపుల్ కేవైసీ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలి. ఆధార్, పాన్ కార్డు వివరాలు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ తదితర సమాచారాన్ని ఇచ్చాక 10 నిమిషాల్లో లోన్‌కు అర్హత ఉందా లేదా అనేది నిర్దారిస్తారు. లోన్‌కు అర్హత ఉంటే అప్పుడు వినియోగదారులు తమకు కావల్సిన మొత్తాన్ని ఎంపిక చేసుకుని 15 నుంచి 90 రోజుల వరకు వాయిదా పెట్టుకోవాల్సి ఉంటుంది. 

ఇక ఇలా ఇచ్చే లోన్‌కు 3 శాతం వడ్డీ ఉంటుందని షియోమీ వెల్లడించింది. పూర్తి వివరాలకు https://in.credit.mi.com/resources/landing/index.html వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.