ధర తగ్గిన షియోమి ఫోన్

First Published 11, Dec 2017, 11:37 AM IST
Xiaomi Mi A1 Gets a Rs 1000 Permanent Price Cut in India Now Available at Rs 13999
Highlights
  • ధర తగ్గిన షియోమి ఎంఐ ఏ1
  • రూ.1000 తగ్గించినట్లు ప్రకటించిన కంపెనీ

ప్రముఖ చైనా మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమి వినియోగదారులకు మరో ఆఫర్ ప్రకటించింది. ఆ కంపెనీకి చెందిన షియోమి ఎంఐ ఏ1 ఫోన్ ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. గత సెప్టెంబర్ నెలలో విడుదలైన ఈ ఫోన్ ధర అప్పట్లో రూ.14,999గా నిర్ణయించారు. కాగా.. ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.1000 తగ్గింది. కాగా రూ.13,999 ఈ ఫోన్ అందజేస్తున్నట్లు  ఇండియా లోని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్  మనుకుమార్ జై తెలిపారు.ధర తగ్గిన ఈ ఫోన్ లను ఎంఐ. కామ్, ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లలో కొనుగోలు చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం ఇదే ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ ‘‘బిగ్ షాపింగ్ డేస్’’ ఆఫర్ లో భాగంగా రూ.12,999కే అందించడం గమనార్హం.

 

షియోమి ఎంఐ ఏ1 ఫోన్ ఫీచర్లు..

5.50 ఇంచెస్ టచ్ స్ర్కీన్

2గిగా హెడ్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్

4జీబీ ర్యామ్

64జీబీ ఇంటర్నల్ మెమరీ

12మెగా పిక్సెల్ వెనుక కెమేరా

5మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా

ఆండ్రాయిడ్ 7.1.2 నగ్గెట్ ఆపరేటింగ్ సిస్టమ్

loader