ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ  షియోమి నుంచి మరో రెండు స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. వచ్చే నెలల్లో ఎంఐ మిక్స్‌ 2ఎస్‌, ఎంఐ 7 పేర్లతో వీటిని భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఎంఐ 7 స్మార్ట్‌ ఫోన్‌ లుక్, ఫీచర్లు ఇప్పటికే ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి. 

ప్రస్తుత సమాచారం మేరకు ఎంఐ 7 స్మార్ట్‌ఫోన్‌ 5.65 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను కలిగి ఉండబోతుందని తెలుస్తోంది. స్నాప్ డ్రాగన్ 845, 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగాపిక్సెల్‌  డ్యూయల్‌ వెనుక కెమెరా,  16 మెగాపిక్సెల్‌  ఫ్రంట్ కెమేరా తదితర ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ లో బ్యాటరీ సామర్థ్యం కూడా అధికంగా ఉన్నట్లు సమాచారం. 4480 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ తయారు చేశారు.