పాత స్మార్ట్ ఫోన్ తో విసిగిపోయారా..? కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా..? మీలాంటి వారి కోసమే షియోమి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం మీరు వాడుతున్న పాత 4జీ స్మార్ట్ ఫోన్ ని మార్చేసి కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. ఏం కంపెనీ ఫోన్ అయినా పర్లేదు.. దానిని ఎక్స్  ఛేంజ్ ఆఫర్ లో ఇచ్చేస్తే.. కొత్త షియోమి ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు.

వినియోగ‌దారులు త‌మ పాత 4జీ ఫోన్‌ను ఎక్స్‌ ఛేంజ్ చేసి కొత్త షియోమీఫోన్‌ను కొనాలంటే https://www.mi.com/in/miexchange/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి. అందులో మీ ఫోన్ కంపెనీ, మోడ‌ల్‌ను ఎంచుకోవాలి. ఫోన్‌పై గీత‌లు, ప‌గుళ్లు ఉండ‌రాదు. తరువాత ఫోన్‌కు వ‌చ్చే రేట్‌ను తెలియ‌జేస్తారు. మీకు ఓకే అనుకుంటే మీ ఫోన్ ఐఎంఈఐ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి ఎక్స్‌ఛేంజ్‌ను క‌న్‌ఫాం చేయాలి. త‌రువాత వ‌చ్చే ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్‌ ను యాక్సెప్ట్ చేయాలి. అనంతం మీకు మీ ఫోన్ అమ్మ‌కానికి విలువైన కూప‌న్‌ను క్రెడిట్ చేస్తారు. దీన్ని ఫోన్ డెలివ‌రీ స‌మ‌యంలో ఉప‌యోగించుకోవాలి. అయితే ఫోన్‌ను డెలివ‌రీ తీసుకునే స‌మయంలో మీరు అమ్మ‌ద‌ల‌చిన పాత ఫోన్‌ను ఇవ్వాలి. దాన్ని ప‌రీక్షించాకే తుది నిర్ణ‌యం తీసుకుంటారు. అక్క‌డ ఫోన్‌ ఓకే అనుకుంటేనే మీకు ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తారు. కొత్త షియోమీ ఫోన్ ఇస్తారు. లేదంటే ఆర్డ‌ర్ క్యాన్సిల్ అవుతుంది.