భారత మార్కెట్లో చైనాకి చెందిన ఎలక్ట్రాన్ వస్తువుల తయారీ సంస్థ షియోమీ దుమ్మురేపుతోంది. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో షియోమీ.. మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు నెం.1 స్థానంలో ఉన్న శాంసంగ్.. రెండో స్థానానికి పడిపోయింది. ప్రముఖ పరిశోధన సంస్థ కాన్సల్ ఇచ్చిన నివేదిక ఈ విషయాలు వెల్లడయ్యాయి.

భారత మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న కంపెనీల ఆధారంగా  ఈ నివేదిక అందజేశారు. ఈ నివేదిక ప్రకారం.. షియోమి 8.2 మిలియన్ల యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో ఉంది. 2017 నాలుగో త్రైమాసికంలో షియోమి 27 శాతం మార్కెట్‌ షేర్‌ను, 17శాతం వార్షిక వృద్ధిని సాధించింది. ఇక శాంసంగ్..7 .3 మిలియన్‌ యూనిట్ల అమ్మకాలతో 25 శాతం మార్కెట్‌ షేర్‌తో రెండో స్థానానికి పడిపోయింది.

తరువాతి స్థానాల్లో వివో, ఒప్పో, లెనోవో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. శాంసంగ్ తో పోలిస్తే.. షియోమి.. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందజేస్తోంది. అందుకే ప్రజలు వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని నివేదిక పేర్కొంది.