ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. హైఎండ్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఎంఐ మిక్స్ 2ఎస్ పేరుతోస్మార్ట్‌ఫోన్‌నుచైనా మార్కెట్‌లో విడుదల చేసింది.బెజెల్ లెస్ స్క్రీన్‌తో ఈ వైస్‌ను మంగళవారం లాంచ్ చేసింది. 8జీబీ ర్యామ్/ 256 స్టోరేజ్, 6 జీబీ/128 స్టోరేజ్, 6 జీబీ/64 స్టోరేజ్ వెర్షన్‌లను అందుబాటులో ఉంచింది.చైనాలో 8జీబీ ర్యామ్/ 256 స్టోరేజ్ ధర సుమారు రూ.41,438గా ఉండగా 6 జీబీ/128 స్టోరేజ్ వేరియంట్‌ధర సుమారురూ. 37,000, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌రూ.34,185గా ఉంది. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ, వైర్‌లెస్ చార్జర్, ఫింగర్ ప్రింట్‌రీడర్ దీని ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది.దీంతోపాటు ఎంఐగేమింగ్ ల్యాప్‌టాప్, ఎంఐ స్పీకర్ మినీని లాంచ్ చేసింది. త్వరలోనే దీనిని భారత మార్కెట్లో కూడా విడుదల చేయనుంది.
ఎంఐ మిక్స్ 2ఎస్ ఫోన్ ఫీచర్లు...
5.9 బెజెల్ లెస్ స్క్రీన్
స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్
2160×1080 ఫుల్ హెచ్‌డీరిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
12+12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
