ఈ ఏడాది చెత్త పాస్ వర్డ్స్ ఇవే..

First Published 25, Dec 2017, 11:06 AM IST
worst passwords of 2017 list is here
Highlights
  • ఈ ఏడాది చెత్త పాస్ వర్డ్స్ ఇవే..

‘‘పాస్ వర్డ్’’.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొబైల్ ఫోన్ దగ్గర నుంచి.. ఎటీఎంలు, మెయిల్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ప్రతీదానికి పాస్ వర్డ్ తప్పనిసరి. భద్రత నేపథ్యంలో ఈ పాస్ వర్డ్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం. మనకు నచ్చినవి, ఇష్టమైన పేర్లు, నెంబర్లను పాస్ వర్డ్ గా పెట్టుకుంటాం. మన పాస్ వర్డ్ ఎదుటివారు కనిపెట్టలేనివిధంగా ఉండేలా అందరూ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే..  కొందరు మాత్రం చాలా సిల్లీగా, సింపుల్ గా పాస్ వర్డ్స్ పెడుతుంటారు. ఈ ఏడాది అతి చెత్త పాస్ వర్డ్స్ జాబితాను స్ప్లాష్ డేటా విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దామా...

ఈ ఏడాది చెత్త పాస్ వర్డ్స్ లో మొదటి స్థానం ‘‘123456’’కి దక్కింది. ఎక్కువ మంది తమ పాస్ వర్డ్ గాపెట్టుకున్న చెత్త పాస్ వర్డ్ ఇదే. కాగా రెండో స్థానంలో ‘‘password’’ ఉంది. ఇక మూడో స్థానంలో ‘‘12345678’’ నిలిచింది. మరికొంతమంది ‘‘డ్రాగన్’’, ‘‘మాష్టర్’’, ‘‘హలో’’,‘‘ఫ్రీడమ్’’, ‘‘వాట్ ఎవర్’’ లాంటి పాస్ వర్డ్స్ కూడా పెట్టుకున్నారు. ఇలాంటి చెత్త పాస్ వర్డ్స్ ని మీరు కూడా ఉపయోగిస్తున్నట్లయితే.. వెంటనే వాటిని మార్చేయండి. ఎందుకంటే.. ఇలాంటి పాస్ వర్డ్స్ వల్ల త్వరగా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. ర్యాంకుల వారీగా చెత్త పాస్ వర్డ్స్ జాబితా కింద ఫోటోలో చూడవచ్చు..

 

loader