Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలోకెల్లా అతిచిన్న క్రిస్మస్ కార్డ్ ఇదే

  • ప్రపంచంలోకెల్లా అతిచిన్న క్రిస్మస్ కార్డును శాస్త్రవేత్తలు రూపొందించారు.
  • దీనిని చూడాలంటే మైక్రోస్కోప్ కావాల్సిందే.. అంత చిన్నదిగా ఉంటుంది.
worlds smallest cristmas card is here

ప్రపంచంలోకెల్లా అతిచిన్న క్రిస్మస్ కార్డును శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనిని చూడాలంటే మైక్రోస్కోప్ కావాల్సిందే.. అంత చిన్నదిగా ఉంటుంది.పోస్టల్ స్టాంప్ కి 200మిలియన్ టైమ్స్ చిన్నది ఈ క్రిస్మస్ కార్డ్. ఈ క్రిస్మస్ కార్డు వెడల్పు కేవలం 15 మైక్రోమీటర్లు. అంత చిన్న కార్డులో క్రిస్మస్ శుభాకాంక్షలను కూడా పొందుపరిచారు.

యూకేలోని నేషనల్ ఫిజికల్ ల్యాబరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. ఈ అతిచిన్న క్రిస్మస్ కార్డుపై స్నో మ్యాన్ బొమ్మ కూడా గీశారు. దాని కింద ‘ సీజన్స్ గ్రీటింగ్స్’ అని రాసి ఉంటుంది. ఈ కార్డును ప్లాటినమ్ కోటెడ్ సిలికాన్ నైట్రేట్ తో తయారు చేశారు. సాధారణంగా ఈ మెటల్ ని ఎలక్ట్రానిక్స్ లో ఉపయోగిస్తారు. ‘క్రిస్మస్‌ సందర్భంగా సరదా కోసం ఈ కార్డును రూపొందించాం. అయితే మా పరిశోధనలకు ఇది అద్దం పడుతుంది’ అని ఓ పరిశోధకుడు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఉత్తేజాన్ని నింపుతాయని కార్డును తయారుచేసిన పరిశోధకులు చెబుతున్నారు. కాగా.. గతంలో అతిచిన్న క్రిస్మస్‌ కార్డుగా రికార్డు సాధించిన కార్డు కంటే ఇది పదింతలు చిన్నది కావడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios