ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ‘వోడ్కా’.. చోరీ

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ‘వోడ్కా’.. చోరీ

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోడ్కా బాటిల్ చోరీకి గురైంది.  డానిష్ బార్ లోని ఈ వోడ్కా బాటిల్ ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ వోడ్కా ఖరీదు.. 1.3 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో  రూ.8కోట్లుపై మాటే.  వొడ్కా అంత ఖరీదా..? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ వొడ్కా బాటిల్ ని ఎలా తయారు చేశారో తెలిస్తే.. ఎవరికైనా దిమ్మ తిరిగిపోతుంది.

 

బంగారం, వెండి మెటల్ తో బాటిల్ ని తయారు చేయగా.. ఆ బాటిల్ మూతకి ఏకంగా వజ్రాలు ఉపయోగించారు. ఇంత ఖరీదైన ఈ బాటిల్ ని డానిష్ బార్ లో ప్రదర్శనకు ఉంచారు. దీంతో.. తెలివిగా ఓ దొంగ దీనిని ఇటీవల చోరీ చేశాడు. దీంతో.. ఈ వార్త కాస్త ఇప్పుడు సంచలనంగా మారింది. బార్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బార్ లోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా.. కేవలం ఒక వ్యక్తి మాత్రమే వచ్చి దానిని చోరీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రదర్శనలో ఉంచి వోడ్కా సీసాను ఎలా దొంగిలించగలిడాగో.. అర్థం కావడంలేదన్నారు. దానికి వేసిన తాళాన్ని పగలకొట్టాడా లేదా అతని వద్ద కీ ఉందా అన్న విషయం ఫుటేజ్ లో స్పష్టంగా తెలియడం లేదన్నారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos