ప్రపంచంలోకెల్లా పొడవైన ‘నూడిల్స్’ ఎలా తయారుచేశారో చూడండి(వీడియో)

ప్రపంచంలోకెల్లా పొడవైన ‘నూడిల్స్’ ఎలా తయారుచేశారో చూడండి(వీడియో)

మీరు నూడిల్స్ లవర్సా? అయితే ఈ వీడియో మీకోసమే. రెండు నిమిషాల్లో రెడీ అయ్యి.. మీ ఆకలితీర్చే నూడిల్స్ ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది. చైనాకి చెందిన కొందరు షెఫ్స్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నూడిల్ ని తయారు చేశారు.దాని పొడవు ఎంతో తెలుసా..10,100 అడుగులు. అది కూడా కేవలం చేతితో చేయడం విశేషం.

40కేజీల బ్రెడ్ ఫ్లోర్, 26.8లీటర్ల నీరు, 0.6కిలోగ్రాముల ఉప్పు కలిపి.. 66కేజీల బరువుగల నూడిల్స్ ని తయారు చేశారు. చైనా కి చెంది షెఫ్స్ దాదాపు 17గంటలు శ్రమించి ఈ నూడిల్స్ తయారు చేశారు. 2001లో జపాన్ కి చెందిన కొందరు షెఫ్స్ 1800 అడుగుల నూడిల్స్ తయారు చేసి రికార్డ్ క్రియేట్ చేయగా.. ఆ రికార్డుని ఈ చైనా షెఫ్స్ బ్రేక్ చేశారు.

ఈ నూడిల్స్ కి అల్లం, కోడిగుడ్డు, టమాటా సాస్ చేర్చి మరింత రుచికరంగా మార్చారు. తర్వాత ఈ నూడిల్స్ 400మంది ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు పంచిపెట్టారు. ఈనూడిల్స్ ఎలా తయారుచేశారో.. మీరు కూడా చూడండి.
 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos