Asianet News TeluguAsianet News Telugu

ఈ కండోమ్ చాలా ‘స్మార్ట్’  గురూ..!

  • పురుషుల స్టామినాని తెలియజేసే కండోమ్ ఇది
Worlds first smart condom collects intimate data during sex

అవాంచిత గర్భం, ఇతర సుఖ వ్యాధులకు దూరంగా ఉండేందుకు కండోమ్ వాడతారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ కండోమ్ మాత్రం అలాంటిది కాదు అంటున్నారు నిపుణులు. ఇది పురుషుల్లో స్టామినాని తెలియజేస్తుందట. మీరు చదివింది నిజమే. ఇది స్మార్ట్ కండోమ్. ఇటీవల బ్రిటీష్ కి చెందిన ఓ కండోమ్ కంపెనీ.. దీనిని తయారు చేసింది. ఈ స్మార్ట్ కండోమ్ విశేషాలేంటో ఒకసారి చూసేద్దామా..

తయారీదారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ కండోమ్ ని ధరించిన పురుషుడి స్టామినాను తెలియజేస్తుంది. అంతేకాదు... సెక్స్‌ సమయంలో ఎన్ని క్యాలరీలు ఖర్చు అయ్యాయో లెక్కగట్టడంతోబాటు.. లైంగికంగా సంక్రమించే వ్యాధులను కూడా గుర్తిస్తుంది. నిజానికి ఇది కండోమ్‌ కాదు. సెక్స్‌ టాయ్‌ని పోలిన పరికరం మాత్రమే! నిజమైన కండోమ్‌తోబాటే ఈ గుండ్రని పరికరాన్ని కూడా ధరించాలి. దీనికి ‘ఐ కాన్‌’ అని పేరు పెట్టింది బ్రిటీష్‌ కండోమ్స్‌ కంపెనీ! ఓ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి అనుసంధానమై స్మార్ట్‌ కండోమ్‌ పనిచేస్తుంది.

బిల్టిన్‌ నానో చిప్‌, బ్లూటూత్‌ ద్వారా.. సమయం, వేగం తదితర డేటాను స్మార్ట్‌ఫోన్‌కి పంపిస్తుంది. ఆ డేటాను యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకుని చూసుకోవచ్చు. ఈ సమాచారాన్ని అంతా ఐ కాన్‌ పరికరం రహస్యంగా ఉంచుతుంది. యూజర్లు కోరుకుంటే డేటాను షేర్‌ చేసుకోవచ్చు. ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే.. 6-8 గంటల పాటు స్మార్ట్‌ కండోమ్‌ పనిచేస్తుంది. దీని ధర 81 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.5వేల పైమాటే. ఈ స్మార్ట్ కండోమ్ ని విడుదల చేసిన రోజు నుంచే డిమాండ్ బాగా పెరిగిందట.

Follow Us:
Download App:
  • android
  • ios