టెర్ర‌రిస్టుల దాడుల‌లో పాక్ స్థానాన్ని అక్ర‌మించిన భార‌త్‌

world wide terror attacks  india had 3 rd rank
Highlights

  • ఇండియాలో పెరిగిన టెర్రార్ ఎటాక్స్
  • మూడవ స్థానంలో నిలించింది
  • పాక్ స్థానాన్ని అక్రమించిన ఇండియా

నేడు ప్రపంచ మానవాళిని భయపెడుతున్న భూతం ఉగ్ర‌వాదం. రోజు ఎదో ఒక మాధ్య‌మంలో బాంబ్ బ్లాస్ట్ లు జ‌రుగుతున్న విష‌యం గ‌మ‌నిస్తునే ఉన్నాం. గ‌తంలో ఎక్కువ‌గా అర‌బ్‌ దేశాల‌లో టెర్ర‌రిస్టు దాడులు అధికంగా ఉండేవి. అయితే నేడు దాదాపుగా అన్ని దేశాల మీద టెర్ర‌ర్ ఎటాక్‌లు జ‌రుగున్నాయి. అయితే అందులో మ‌న దేశం కూడా ఉంది. గ‌తంలో క‌న్న ఇప్పుడు ఉగ్ర‌ దాడుల శాతం పెరిగింది. ఇదే విష‌యాన్ని అగ్ర‌రాజ్యం అమెరికా పెర్కొంది.

అమెరికా ఇంటెలిజెన్స్  వ‌ర్గాల నివేదిక ప్ర‌కారం 2016 సంవ‌త్స‌రంలో ప్ర‌పంచ వ్యాప్తంగా 11,072 ఉగ్ర‌దాడులు జ‌రిగాయ‌ని పెర్కొంది. అందులో ఇరాక్ లో 3,456 దాడులు జ‌రిగాయ‌ని, అఫ్ఘ‌నిస్తాన్ మీద 2,976 దాడులు జ‌రిగాయ‌ని, ఈ రెండు దేశాల త‌రువాత భార‌త్ నిలిచింద‌ని తెలిపింది. గ‌త సంవ‌త్స‌రం ఇండియాలో 927 ఉగ్ర దాడులు జ‌రిగ‌నట్లుగా అమెరికా తెలిపింది. ఇక నాలుగవ స్థానంలో పాక్ నిలిచింది.

అయితే 2015 వ‌ర‌కు ప్ర‌పంచంలో అధికంగా ఉగ్ర‌దాడులు జ‌రుగుతున్న దేశాల‌లో మూడ‌వ స్థానంలో పాకిస్తాన్ ఉండేది. కానీ 2016 లో పాక్ క‌న్న ఎక్కువ‌గా ఇండియాలో టెర్ర‌ర్ ఎటాక్‌లు జ‌రిగాయ‌ని తెలిపింది. ఇండియాను టార్గేట్ చేస్తు ఉగ్ర‌వాదులు త్వ‌ర‌లో మ‌రిన్ని దాడులకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని త‌న తాజా నివేధిక‌లో తెలిపింది.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader