త్వరలో ప్రారంభం కానున్న హైదరాబాద్ మెట్రో రైలు మెట్రో రైలు డ్రైవర్లుగా లోకల్ మహిళలు ఉన్నత చదువులు చదివి ఇటువైపు అడుగులు వేసిన యువతులు 

హైదరాబాద్ మెట్రో రైలు కల మరికొద్ది రోజుల్లో నెరవేర నుంది. గత కొద్ది సంవత్సరాలుగా నగరంలో మెట్రోరైలు ఎప్పుడు ఎదురౌతుందా అని ప్రజలంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. వచ్చే నెల ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

అయితే.. త్వరలో ప్రారంభంకానున్న ఈ మెట్రో రైలు స్టీరింగ్ ని హెచ్ ఎం ఆర్( హైదరాబాద్ మెట్రో రైలు) మహిళల చేతికి అందివ్వబోతన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్ షిప్ ప్రాజెక్టు అయిన ఈ మెట్రో రైలులో మహిళా డ్రైవర్లను నియమిస్తున్నారు. ఇప్పటి వరకు హెచ్ ఎంఆర్ 100 మంది మహిళా డ్రైవర్లకు శిక్షణ ఇవ్వగా.. వారిలో 35 మంది ఇప్పటికే రైలు స్టీరింగ్ తిప్పేస్తున్నారు.

గత 18 నెలలుగా ఈ మహిళా డ్రైవర్లంతా ట్రయల్ రన్ కింద రైళ్లను నడుపుతున్నారని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ‘తెలంగాణ టుడే’ కథనం ప్రకారం ఈ మహిళా డ్రైవర్లలో చాలా మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు.

హైదరాబాద్ మెట్రో రైలు తనను తాను నిరూపించుకోవడానికి మంచి అవకాశం కల్పించదని.. ప్రస్తుతం చాలా మంది మహిళలు రైళ్లను నడుపుతున్నారని.. ఈ ప్రాజెక్టులో తాను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందంటూ మహిళా డ్రైవర్ సింధుజా అన్నారు. వరంగల్ కి చెందిన సింధుజ ట్రైల్ రన్ లో భాగంగా ఇప్పటి వరకు 18నెలల్లో 8వేల కిలోమీటర్లు రైలుని నడిపింది.

ఈ మహిళా డ్రైవర్లందరికీ అంతా సులభంగా ఈ అవకాశం రాలేదు. సైకో మెట్రిక్ పరీక్షలు, రీసర్చ్ డిజైన్స్, సాండర్డ్ ఆర్గనైజేషన్స్ టెస్ట్, టెక్నికల్ రౌండ్స్, మెడికల్ టెస్టులు పెట్టి సెలక్ట్ చేశారు. ఆ తర్వాత ఆరు నెలల పాటు ఇంటెన్స్ ట్రైనింగ్ ఇచ్చి ఈ దశకు చేరుకున్నారు.

ఈ టెస్టుల్లో పాసవ్వడం పక్కనపెడితే.. ముందుగా ఇంట్లో కుటుంబసభ్యలను ఒప్పించడమే చాలా మంది కష్టమైంది.

‘‘ఈ జాబ్ లో అడుగుపెడతానంటే మా అమ్మ ఒప్పుకోలేదు.. కానీ మా నాన్న మాత్రం నాకు పూర్తి మద్దతుగా నిలిచారు.’’ అని చెబుతోంది మహబూబ్ నగర్ కి చెందిన వెన్నెల. ఈమె ఇప్పటి వరకు 3వేల కిలోమీటర్లు రైలుని డ్రైవ్ చేసింది.

‘‘ మా స్నేహితులు నా కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉండొచ్చు. కానీ.. మీలో ఎవరైనా రైలు నడిపారా అని నేను అడిగినప్పుడు వారంతా సైలెంట్ అయిపోయారు. డబ్బు అందరికీ అవసరమే. కానీ అంతకంటే ముందు జాబ్ సాటిస్ ఫాక్షన్ అంతకంటే ఎక్కువ’’ అంటోంది నిజామాబాద్ కి చెందిన సుప్రియ. ఈమె ఇప్పటి వరకు 2,500 కిలోమీటర్ల దూరం రైలును నడిపింది.

వీరిలో చాలా మందికి జీవితాంతాం డ్రైవింగ్ చేస్తూ ఉండాలని లేదు. కొందరికి స్టేషన్ కంట్రోలర్, డిపార్ట్ మెంట్ కంట్రోలర్, ట్రాఫిక్ కంట్రోలర్ ఉద్యోగాల్లో స్థిరపడాలని ఉందని చెబుతున్నారు.