ఎక్కువ కాలం కెప్టెన్ గా చేసిన మిథాలీ. అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్. అర్జునా, పద్మ శ్రీ పురస్కారం అందుకున్నారు.
ఇప్పటి వరకు మహిళ క్రికెట్ టీం కి అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు, కానీ అది గతం, 2017 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు వరకు, ప్రారంభం అయిన తరువాత మహళ క్రికెట్ కు గతంలో ఏనాడు లేని విధంగా ప్రచారం వచ్చింది. అందుకు కీలక పాత్ర పోషించింది భారత్ కెప్టెన్ మిథాల్ రాజ్.

భారత మహిళల టీ 2017 ప్రపంచ మహిళల ప్రపంచ కప్ లో తొలి దశ నుండి ఫైనల్ వరకు చేరింది. కానీ ఫైనల్ లో ఒటమితో వెనుదిరిగింది. అయినా మహిళ క్రికెట్ టీం కి ప్రసంశల వర్షం ఆగడం లేదు కారణం వారి ప్రపంచ కప్ లో బారత్ టీం చూపిన అద్బుత ప్రదర్శనే, అందులో మనం ప్రధానం గా చర్చించాల్సిన పేరు కెప్టేన్ మిథాలీ రాజ్, తన స్పూర్తి తోనే ఫైనల్ కి చేరిందని జట్టులో మిగత 10 ఆటగాళ్లు అంటున్నారు. అస్సలు ఎవరీ మిథాలీ రాజ్ ఆమె వివరాలు ఇప్పుడు మనం చూద్దాం.

మిథాలీరాజ్ పక్క లోకల్
తండ్రి ఎయిర్‌పోర్స్ లో ఉద్యోగం, తల్లి తమిళ్, ఉద్యోగ రిత్య 1992 లో కుటుంబంతో సహా హైదరాబాద్ కి వచ్చేశారు. అప్పటి నుండి హైదరాబ్ లోనే స్థిరపడ్డారు.
డ్యాన్సర్ అవ్వాల్సింది.
మిథాలీ రాజ్ తన ప్రైమరీ చదువును సికింద్రాబాద్ లోని కీస్ హై స్కూల్ లో చదివింది. డ్యాన్సర్ అవ్వలనుకుంది కానీ క్రికెటర్ అయింది. 12 సంవత్సరాల వయస్సు నుండి క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది. తన అన్నతో కలిసి క్రికెట్ ఆడేది. తనకి క్రికెట్ గురువు తన పెద్ద అన్న అని పలు సందర్భాలలో చెప్పింది. మిథాలికి చిన్న తనం నుండి తనకి క్లాసికల్ డ్యాన్స్ అంటే బాగా ఇష్టపడేది. తన 8 సంవత్సరాల నుండి క్లాసికల్ డ్యాన్సర్ అవ్వాలని కలలు కన్నది. కానీ క్రికెట్ ప్రాక్టీస్ చెయ్యడం ప్రారంభించిన తరువాత ఆమె క్లాసికల్ డ్యాన్స్ కి పులిస్టాప్ పెట్టింది.

క్రికెట్ ప్రారంభం.
మిథాలీ రాజ్ తన 17 వ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది. 1999 లో ఐర్లాండ్ జట్లుతో తన మొట్ట మొదటి వన్డే మ్యాచ్ ను ఆడింది. 2002 లో టెస్టు క్రికెట్ కెరీర్ ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తిరిగి చూసుకోలేదు మిథాలీ. 1999 నుండి ఇప్పటి వరకు మిథాలి జట్టులో కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 17 సంవత్సరాలకు పైగా ఎందరో జట్టులోకి వచ్చి పోతున్న మిథాలి మాత్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

జట్టు పగ్గాలు.
మిథాలీ రాజ్ తన చక్కటి ఆట తీరుతో ఎన్నో సార్లు జట్టు గెలుపులో భాగ్యస్వామి అయింది. ఇది గమనించిన బిసిసిఐ 2005 ప్రపంచ కప్ కి మిథాలీని కెప్టెన్ గా భాద్యతలు అందించారు. అప్పటి వరకు ఇండియన్ ఉమెన్స్ టీం ఏనాడు సెమీస్కి వెళ్లలేదు కానీ మిథాలీ 2005 ప్రపంచ కప్ లో ఇండియా టీం ను ఏకంగా ఫైనల్ కి చేర్చింది. కానీ ఫైనల్ లో ఆస్ట్రేలియా పైన ఇండియా ఓటమి పాలయింది.
మిథాలీ రాజ్ రికార్డ్
భారత్ నుండి అప్పటి వరకు ఇండియా గెలుపుల కన్న ఓటమిలే ఎక్కువగా ఉండేవి, కానీ మిథాలీ కెప్టెన్ అయ్యాక ఓటమీ శాతం తగ్గుతు వచ్చింది.మిథాలీ ఇండియా టీమ్ కి సెలక్ట్ అయిన నాటి నుండి ఇప్పటికి జట్టులో ఆధారపడదగిన బ్యాట్స్ ఉమెన్ ఆమె ఒకరు.
* 2005 లో అద్బుత ఆటతీరులో టీం ఇండియాను ఫైనల్ కి చేర్చింది.
* 2006 లో ఇంగ్లాండ్ పై వారి దేశంలో టెస్ట్ సిరీస్ గెలిచింది. మరో 12 నెలలలో రెండవ సారి ఇంగ్లాండ్ పై టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది.
.* 2008 లో ఇండియాకు నాలుగవ సారి ఆసియా కప్ టైటిల్ ను గెలుపులో కీలక పాత్ర పొషించింది

* 2008 లో 3000 పరుగుల మైలురాయిని సాధించింది.
* 2017 లో ఇండియా టీం నుండి అత్యధిక పరుగులు సాధించిన మహిళగా రికార్డుకి ఎక్కింది, 6137 పరుగులు.
*2009 లో కెప్టెన్సీని కోలల్పోయిన మిథాలీ ఆమె ఇంగ్లండ్ పర్యటన కోసం 2012 లో తిరిగి బాధ్యతలు స్వీకరించింది.
*2012 నుండి ఐసిసి ప్రపంచ బ్యాటింగ్ ర్యాంకింగ్ లో టాప్ ర్యాంక్ ను తిరిగి పొందింది.
*2013 లో మహిళల టీ20 ప్రపంచ కప్ లో సెమీస్‌కి చేరడంలో ప్రధాన పాత్ర పోషించింది. కానీ సెమీస్ లోనే టీం ఇండియా వెనుదిరిగిందది.
వన్డే
సెంచరీలు - 5
అర్థ సెంచరీలు - 43.
వన్డేలో అత్యధిక పరుగులు 214 (ఇంగ్లండ్ పై)
టెస్ట్
సెంచరీలు- 1
అర్థ సెంచరీలు- 4
అత్యధిక పరుగులు - 114 నాటౌట్ ( ఐర్లాండ్ పై)
టీ20
సెంచరీలు -0
అర్థ సెంచరీలు - 10
అత్యధిక పరుగులు - 73 నాటౌట్ ( శ్రీలంక పై)
గుర్తింపు
మిథాలీ రాజ్ సేవలకు భారత ప్రభుత్వం 2003 లో అర్జున్ అవార్డ్‌ను అందించింది, 2015 లో పద్మ శ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు.
