దేశరాజధాని ఢిల్లీ మెట్రో రైలులో బులెట్లు కలకలం సృష్టించాయి. ఓ మహిళ తన బ్యాగులో బులెట్లు పెట్టుకొని ప్రయాణించడాన్ని అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రిపబ్లిక్ డే సమీపిస్తుండటంతో నగరంలోని పలు ముఖ్య ప్రాంతాలు, మెట్రో స్టేషన్లు, బస్టాండ్లలో భద్రత పెంచారు. ఇందులో భాగంగానే ఆదర్శ్ నగర్ స్టేషన్ లో తనిఖీలు చేస్తుండగా.. ఓ మహిళ బ్యాగ్ లో 20 బులెట్లు లభ్యమయ్యాయి. మహిళను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. మహిళతోపాటు ఆమె కుటుంబసభ్యులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. బులెట్ల గురించి మహిళను ప్రశ్నించగా.. అవి తమవేనని ఆమె అంగీకరించింది. వారి వద్ద గన్ లైసెన్స్ ఉన్నట్లు తెలిపారు. బులెట్లను స్వాధీనం చేసుకున్న సీఐఎస్ ఎఫ్ సిబ్బంది.. వారిని పోలీసులుకు అప్పగించారు.