భార్యని హత్య చేసి.. బియ్యం సంచిలో ప్యాక్‌

women deadbody hyderabad pathabasthi
Highlights

మృతదేహాన్ని  పార్శిల్ చేసినట్టు గుర్తించారు

హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ మహిళను హత్య చేసి, దాన్ని బియ్యం సంచిలో ప్యాక్‌ చేసి రైల్వే ట్రాక్‌ సమీపంలో పడేశారు . ఈ దారుణం ఆదివారం వెలుగులోకి  వచ్చింది. పాతబస్తీ ప్రాంతమైన  డబీర్ పుర లోని రైల్వే ట్రాక్ పై  ప్రయాణికులకు  ఓ పార్శిల్  కంటపడింది. దీంతో పోలీసులకు సమాచారమందించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఎక్కడో మహిళను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని  పార్శిల్ చేసినట్టు గుర్తించారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.  మహిళను రెండు రోజుల క్రితం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఆమె ఒంటిపై తీవ్ర గాయాలున్నాయి. పోలీసుల విచారణలో భర్తే హంతకుడని తేలింది.

loader