మందేసి.. పోలీసులకు చుక్కలు చూపించిన యువతి

మందేసి.. పోలీసులకు చుక్కలు చూపించిన యువతి

పీకలదాకా మద్యం తాగి ఓ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నించింది.  దీంతో ఆ యువతిని పట్టుకునేందుకు పోలీసులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌గూడకు చెందిన కీర్తి అనే యువతి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మీదుగా రోడ్డు నంబరు 1లోని చిరంజీవి రక్తనిధి కేంద్రం వైపు వచ్చింది. అక్కడే ఉన్న పోలీసులు కారును ఆపే ప్రయత్నం చేశారు. కారును ఆపినట్లే ఆపి.. వెంటనే ఆమె ఒక్కసారిగా కారు వేగాన్ని పెంచింది. పోలీసులు ఆమెను పట్టుకునేందుకు రోడ్డుకు అడ్డంగా బౌల్డర్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినా సరే.. వాటిని నెట్టుకుంటూ కారుతో వెళ్లిపోయింది. దీంతో పోలీసులు సినీ ఫక్కీలో వెంబడించి ఆమెను పట్టుకున్నారు.

అనంతరం యువతికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయగా.. ఆమె మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలింది. దీంతో  ఆమెపై కేసు నమోదు చేసి కారు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ లలోని ఆరు ప్రాంతాల్లో చేసిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షల్లో మొత్తం 85 కేసులు నమోదయ్యాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos