సినీ ఫక్కీలో స్మగ్లింగ్.. తెలివిగా పట్టుకున్న పోలీసులు

Woman Tried To Smuggle In Cocaine In 106 Capsules That She Had Swallowed
Highlights

స్మగ్లింగ్ చేయడానికి కొకైన్ క్యాప్సిల్స్ మింగిన యువతి

హీరో సూర్య, తమన్నా జంటగా నటించిన ‘ వీడొక్కడే’ సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో హీరోయిన్ అన్నయ్య స్మగ్లింగ్ చేయడానికి కొకైన్ క్యాప్సిల్స్ మింగుతాడు. అచ్చం అలాంటి సీనే దేశరాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగింది. కాకపోతే ఇక్కడ అలాంటి సాహసానికి ఒడిగట్టింది ఓ యువతి కావడం గమనార్హం.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...ఈ నెల14న బ్రెజిల్‌కు చెందిన 25 ఏళ్ల యువతి ఢిల్లీలోని ఓ నైజీరియన్‌ వ్యక్తికి సరుకు అందజేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. కొకైన్‌ అందితే ఐదువేల డాలర్లు ఆమెకు ఇచ్చేలా బేరం కుదిరింది. ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఉన్న ఆ నైజీరియన్‌కు దీన్ని చేరవేయడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆమెను స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానించారు. యువతిని హాస్పిటల్‌కు తరలించి ఎక్స్‌రే తీసి పరీక్షించగా అసలు విషయం బయటపడింది.

ఆమె కడుపులో 930 గ్రాముల సౌత్‌ అమెరికన్‌ కొకైన్‌ క్యాప్సుల్స్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి విలువ దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసలు తెలిపారు. నేరాన్ని అంగీకరించిన ఆమె తన రెండవ భర్త కారణంగానే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిపింది. ఆదివారం ఆమెను సిటీ కోర్టు ఎదుట హాజరుపర్చిన పోలీసులు నేరం నిరూపణ కావటంతో తీహార్‌ జైలుకు తరలించారు.

loader