రైలులో పాముతో సహా ప్రయాణం చేశాడు ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఏదో పనిమీద నడుచుకుంటూ వెళుతుంటే.. అకస్మాత్తుగా పాము కనపడిందను కోండి.. భయంతో ఒక్కసారిగా వణికిపోతాం. అనుకోకుండా పాములు మనకు తారసపడుతూనే ఉంటాయి. ఇప్పటి వరకు విమానం క్యాబిన్ లోకి పాము వచ్చింది.. ఏసీ మెషిన్ లో పాము దూరింది.. లాంటి వార్తలు వినే ఉంటాం.. కానీ మనం తరచూ ప్రయాణించే రైలులో పాము కనపడిన వార్తలు ఎప్పుడైనా చూశారా.. అందులోనూ ఓ వ్యక్తి.. దానిని ఓ పెంపుడు జంతువుని తీసుకొని వెళ్లినట్లు జాగ్రత్తగా రైలులో తీసుకొని వెళ్లడం చూశారా.. అదే జరిగింది బోస్టన్ లో.

ఓ వ్యక్తి... అత్యంత రద్దీ గా ఉన్న రైలులో పాముతో సహా ప్రయాణం చేశాడు. దానిని చూసిన ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియోలో పాముని తీసుకువెళ్లిన వ్యక్తి ముఖం కనపడలేదు. కేవలం అతని చేతిలో ఉన్న పాము మాత్రమే కనపడుతోంది. ‘ పాముని రైలులో తీసుకువెళ్లే నియమం ఉందా ’ అంటూ సంబంధిత అధికారులను ప్రశ్నిస్తూ.. ఆమె వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి మాత్రం స్పందన బాగా వస్తోంది. దీంతో వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై అధికారులు స్పందించారు. సమాచారం అందించినందుకు ఆమెకు దన్యవాదాలు తెలిపారు.చిన్న జంతువులను రైలులో తీసుకువెళ్లేటప్పుడు.. వాటని చేతిలో పట్టే ఏదైనా బాక్సులో పెట్టి తీసుకువెళ్లాలని అధికారులు చెప్పారు.