మానవ సంబంధాలు రోజు రోజుకీ దిగజారి పోతున్నాయి అనడానికి నిదర్శనం  ఈ సంఘటన. ఓ యువతి ప్రియుడితో కలిసి.. భర్తను దారుణంగా వేధించింది. ప్రియుడితో కలిసి సరసాలాడుతున్న వీడియోలను ఏకంగా భర్తకే పంపించింది. ఆ వీడియోలు చూసి తట్టుకోలేని భర్త.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...దండేపల్లి మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన నక్క ధర్మరాజు(27) అనే యువకుడికి గతేడాది మార్చిలో జగిత్యాల మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన నాగలక్ష్మితో వివాహం జరగింది. అయితే కొద్ది కాలంగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ కు చెందిన మంత్రి మహేష్ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
ఇటీవల నాగలక్ష్మి ప్రియుడితో కలిసి సరసాలాడుతూ సెల్ఫీ వీడియోలు తీసి తీసి భర్త ధర్మరాజుకి వాట్సాప్ లో పంపింది. అంతేకాకుండా భర్త కట్టిన తాళిని మెడలో నుంచి తీసి.. అదే తాళిని మళ్లీ ప్రియుడితో వేయించుకుంది. దానిని కూడా వీడియో తీసి భర్తకు పంపింది. ఆ వీడియోలను చూసి తీవ్ర అవమానంగా భావించిన భర్త ధర్మరాజు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.