జనావాసాల మధ్య లిక్కర్ షాపులు ఏర్పాటుచేయవద్దని అంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా కీసరలో మహిళలు నిరసన తెలిపారు.
ఆంధ్రలో చిత్తు చిత్తుగా మద్యం దుకాణాాలొస్తున్నాయి. ఏలిన వారి మద్దతు ఉంటే జనావాసాల మధ్య లిక్కర్ షాపులొస్తాయి. ఇదే జరిగింది కీసర గ్రామంలో. జనావాసాలకు దేవాలయాలకు విద్యాలయాలకు దూరంగా మద్యషాపులు ఉండాలన్న నిబంధనను ఉల్లంగిస్తూ కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో రెండు మద్యం షాపులను నిర్మిస్తున్నారు. ఇది గ్రహించి మహిళలు మా నివాసాలమధ్య మద్యం షాపులను పెట్టవద్దని ఇక్కడ ఒక మస్జిద్ చర్చి మరియు స్కూలు ఉన్నాయని మాపిల్లల భవిషత్తు పాడవుతుంది కీసర గండిపల్లి రహదారిపై బైఠాయించి వారి పిల్లలతోసహా ఆందోళననిర్వహించారు. సమాచారం అందుకున్న పొలీసులు అక్కడికి చేరుకొని అందోళను ఎక్సయిజ్ ఆఫీస్ వద్దచేసుకోవాలని రహదారిపై చేయవద్దని వారిని అక్కడినుండి వెళ్లగొట్టారు
