ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య

First Published 6, Apr 2018, 1:19 PM IST
Woman kills husband with paramours help
Highlights
హైదరాబాద్ సరూర్ నగర్ లో దారుణం

తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడి తో కలిసి అంతమొందించిన ఘటన హైదరాబాద్ సరూర్ నగర్ లో చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి హత్యలు ఎక్కువయ్యాయి. నాగర్ కర్నూల్ స్వాతి నుండి మొదలైన ఈ భర్తల హత్యలు ప్రస్తుత కవిత వరకు కొనసాగింది. సేమ్ స్వాతి మాదిరిగానే ఓ కట్టుకథ అల్లి పోలీసులను బురిడీకొట్టించాలని భావించిన కవితకు కూడా స్వాతి గతే పట్టింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు కింది విధంగా ణ్నాయి.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సత్యంతండాకు చెందిన నేనావత్‌ రాజు(30)కు యాదాద్రి జిల్లాకు చెందిన కవితతో ఆరేళ్లక్రితం పెళ్లమింది. అయితే పెళ్లి తర్వాత ఈ జంట ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చి సరూర్ నగర్ లో నివాసముంటున్నారు. రాజు మాదన్నపేట్ మార్కెట్ లో బజ్జీల బండి నడపగా, కవిత ఇంట్లోనే ఉండేది. అయితే ఇంట్లో ఒంటరిగా ఉండే క్రమంలో కవితకు రాజు దూరపుచట్టం నేనావత్‌ సుమన్‌(22 ) తో పరిచయం ఏర్పడింది.  ఈ పరిచయం కాస్తా అక్రమ సంబంధంగా మారింది. ఈ విషయం తెలిసి భర్త రాజు కవిత ను చితకబాదడంతో పాటు పెద్దలవద్ద పంచాయతీ పెట్టాడు. అయితే కవితకు సర్దిచెప్పిన పెద్దలు మళ్లీ ఇలా చెయ్యదని హామీ ఇచ్చి కాపురాన్ని చక్కదిద్దారు.

అయితే ప్రియుడిని విడిచి ఉండలేక పోయిన కవిత దీనికి అడ్డుపడుతున్న భర్తను అంతమొందించుకోవాలని చూసింది. దీంతో ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ఇంట్లో మద్యం మత్తులో పడుకున్న భర్తను ప్రియుడి సాయంతో గొంతు నులిమి చంపిన కవిత ఆ మృతదేహాన్ని గుర్రంగూడ అటవీ ప్రాంతంలో పడేశారు. ఆ తర్వాత తనకేదీ తెలియనట్లు కవిత అత్తమామలతో కలిసి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు భార్య కవితపైనే అనుమానం కల్గింది. దీంతో తమదైన శైలిలె విచారించగా అసలు నిజాన్న కవిత బైటపెట్టింది.

దీంతో కవిత ఆమె ప్రియుడు సుమన్ తో పాటు ఈ హత్యకు సాయపడ్డ ఓ మైనర్ బాలుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.  
 

loader