దేశరాజధానిలో మరో నిర్భయ ఘటన

నిర్భయ ఘటనతో దేశంలో కొత్త చట్టాలుపుట్టుకొచ్చాయి. మహిళలను వేధించేవారికి కఠిన శిక్షలు పడుతున్నాయి. అయినా మృగాళ్లలో మార్పు రావడం లేదు.

నిర్భయ ఘటన చోటు చేసుకున్న దేశ రాజధానిలోనే అలాంటి ఘటనే మళ్లీ జరిగింది.

తూర్పు ఢిల్లీలోని ప్రణవ్ నగర్ ప్రాంతంలో ఓ యువతిపై ఐదుగురు మృగాళ్లు లైంగికదాడికి దిగారు. వారి నుంచి తప్పించుకోడానికి ఆమె నగ్నంగా అపార్టుమెంటు బాల్కనీ నుంచి రోడ్డు మీదకు దూకేసింది.

సాయం చేయాల్సిందిగా రోడ్డు మీద వెళ్తున్న వారిని దీనంగా వేడుకుంది. కానీ, ఏ ఒక్కరూ కరుణించలేదు.

ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగగా చాలా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడకు దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.