ఉన్నతాధికారి లైంగిక వేధింపులతో యువతి ఆత్మహత్యాయత్నం

First Published 7, Apr 2018, 7:08 PM IST
Woman Attempts Suicide  at hyderabad
Highlights
హైదరాబాద్ మాదాపూర్ లో దుర్ఘటన

ఆపీసులో ఉన్నతాధికారి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న షీ టీమ్స్ వేధింపులకు పాల్పడుతున్న అధికారితో పాటు అతడికి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

బంజారాహిల్స్‌ రోడ్డునెం-2లోని ఒక ఫార్మా కంపెనీలో ఓ యువతి కొత్తగా ఉద్యోగంలో చేరింది. అయితే ఆమెతో కంపెనీలో ఏజీఎంగా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన అశితోష్‌ అసభ్యంగా వ్యవహరించేవాడు. అసభ్యంగా మాట్లాడుతూ, వెకిలి చేష్టలకు పాల్పడుతూ లైంగికంగాను, మానసికంగాను వేధించాడు. దీంతో ఈ వేధింపులు తట్టుకోలేక యువతి తన హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే దీన్ని గమనించిన సహచరులు ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు. అలాగు ఆ యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

 దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు షీటీమ్స్ ను ఆశ్రయించారు.వీరి షిర్యాదుతో షీటీమ్స్ అశితోష్, గణేష్‌లను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి, విచారణ చేపట్టారు.

loader