సూర్యాపేట మహిళపై పట్టపగలే కత్తులతో దాడి

First Published 3, Jan 2018, 7:53 PM IST
woman attacked with knives in the broad day light in Suryapet
Highlights
  • సూర్యాపేటలో దారుణం
  • పట్టపగలే మహిళపై కత్తులతో దాడి
  • పరిస్థితి విషమం

 

సూర్యాపేట పట్టణంలో దారుణం జరిగింది.  పట్టణ శివారుతో ఓ మహిళపై కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హత్యాప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఆ మహిళ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

వివరాల్లోకి వెళితే సూర్యాపేటకు చెందిన శంకర శెట్టి సౌజన్య అనే మహిళపై కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఇద్దరు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపడానికి ప్రయత్నించారు. మహిళ మొహం, మెడనే టార్గెట్ చేసుకుని దాడి చేశారు. దీంతో ఆమె తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయింది. గాయాలతో పడివున్న ఆమెను గమనించివారు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. 

ఈ ఘటనపై బాధితురాలు బాట్లాడుతూ...ఇద్దరు దుండగులు ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలిపింది. దాడి అనంతరం తన దగ్గరున్న రూ.5 వేల నగదును తీసుకుని దుండగులు పరారయ్యారని తెలిపింది.

 భాదితురాలి స్టేట్మెంట్ తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు,  సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   


 

loader