భర్తల దగ్గర భార్యలు దాచిపెడుతున్న సీక్రెట్ ఇదే..

wives maintaining secret Accounts to keep them Afloat if their marriage Fails
Highlights

  • భార్యభర్తల బంధంపై ఆసక్తికర సర్వే
  • భర్తకు తెలియకుండా భార్య బ్యాంక్ ఖాతా

ఏడడుగులు, మూడు ముళ్లతో ఏర్పడుతుంది భార్యభర్తల బంధం. ఆలు మగలు అంటే.. ఎలాంటి దాపరికాలు లేకుండా అన్యోన్యంగా సాగాలి అని పెద్దలు చెబుతుంటారు. అయితే.. ఈ మధ్యకాలంలో భార్యలు.. భర్తల దగ్గర ఓ విషయాన్ని దాచిపెడుతున్నారట. తాజా సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇంతకీ అదేంటో తెలుసా..? ఇంకెందుకు ఆలస్యం చదవండి.

భార్యలు.. తమ భర్తలకు తెలియకుండా సీక్రెట్ గా ఎకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రతి నెలా.. భర్తకు తెలియకుండా కొంత మొత్తాన్ని ఆ ఖాతాలో దాచుకుంటున్నారు. ప్రతి ఐదుగురిలో ఒక మహిళ ఈ విధంగా డబ్బులను దాచుకుంటున్నారని తాజా సర్వేలో వెల్లడయ్యింది. ఇలా దాచిపెట్టుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయట. ఒక్కసారిగా తమ వివాహ బంధం చెడిపోయి.. విడాకులు తీసుకోవాల్సి వస్తే.. తమకంటూ ఒక ఆధారం ఉండాలి కాబట్టి ఈ విధంగా దాచుకుంటున్నామని కొందరు సమాధానం చెప్పారు. మరికొందరేమో.. భవిష్యత్తులో ఇంటికి  సంబంధించి ఏదైనా అవసరం వచ్చే అవకాశం ఉందని.. అందుకే ముందు జాగ్రత్తగా ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు.

కేవలం ఉద్యోగం చేసే మహిళలు మాత్రమే కాదు.. గృహిణిలు కూడా భర్తలకు తెలియకుండా డబ్బులు దాచిపెడుతున్నారు. కొందరు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాలు తెరుస్తుంటే.. మరికొందరేమో.. తమకు తెలిసిన ఇతర విధానాల్లో సేవింగ్స్ చేస్తున్నారు.

loader