డిసెంబర్ 30 తర్వాత కూడా విత్ డ్రా పై ఆంక్షలు నోట్ల ముద్రణ ఆలస్యమవడమే కారణం

ఒక్క 50 రోజులు ఆగండి దేశాన్ని మార్చేస్తా... నల్లధనాన్ని నిర్మూలిస్తా అని చెప్పిన మోదీ సర్కారు ఇప్పుడు మెళ్లగా మాటమారుస్తోంది.

పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను సరిగా అంచనా వేయని సర్కారు పూటకో మాట చెబుతోంది.

ఇటీవల డిసెంబర్ 30 తర్వాత ఏటీఎం నుంచి విత్ డ్రా పరిమితిపై విధించిన ఆంక్షలు ఎత్తవేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసందే.

అయితే దీనిపై మళ్లీ మాట మార్చేందుకు కేంద్రం సాకులు వెతుకుతోంది.

డిసెంబర్ 30 తర్వాత కూడా ఆంక్షలు కొనసాగంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి ఆర్ బి ఐ నే కారణంగా చూపనున్నట్లు తెలుస్తోంది. నోట్ల డిమాండ్‌కు తగినంత సప్లయ్ లేకపోవడమే ఇందుకు కారణం.

ఇప్పటికే 2 వేల నోట్ల ముద్రణను ఆర్ బి ఐ బాగా తగ్గించింది. అయితే 500 నోట్ల ముద్రణను పెంచారు. అయినా ప్రజలకు అవి అందుబాటులోకి రావడం లేదు.

ఈ నేపథ్యంలో డిసెంబర్ 30 లోపు విత్‌డ్రా పరిమితులు తొలగించడం కష్టమని మోదీ సర్కారు నిర్ణయించింది.

 దీంతో బ్యాంకుల్లో వారానికి 24 వేలు, ఏటీఎంల్లో రోజుకు 2,500 రూపాయల వరకూ మాత్రమే తీసుకోవాలని విధించిన ఆంక్షలను తొలగించడంపై మరింత సమయం తీసుకోవాలని భావిస్తోంది.

దీనిపై త్వరలో ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.