Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ 2018.. ప్రజలు ఏం కోరుకుంటున్నారు

అసలు దేశ ప్రజలు.. ఈ ఏడాది బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నారు..? ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ లో ఎలాంటి అంశాలు ఉండాలని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు

wishlists of common people on budget 2018

బడ్జెట్ 2017-18 దగ్గరకు వచ్చేసింది. మరో మూడు రోజుల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. వచ్చేది ఎన్నిక ల సంవత్సరం కాబట్టి.. బడ్జెట్ ని ప్రజలకు అనుకూలంగానే ప్రవేశపడతారని పలువురు భావిస్తున్నారు. అయితే.. అసలు దేశ ప్రజలు.. ఈ ఏడాది బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తున్నారు..? ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ లో ఎలాంటి అంశాలు ఉండాలని సాధారణ ప్రజలు ఆశిస్తున్నారో.. ఇప్పుడు చూద్దామా..

1. ఆదాయ పన్ను మినహాయింపు...

ఈ ఏడాది బడ్జెట్ లో ఆర్థిక శాఖ.. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును పెంచనుందనే వార్తలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. విశ్వనీయ వర్గాల సమాచారం మేరకు .. 2018-19 బడ్జెట్‌లో ప్రస్తుత రూ.2.5 లక్షల వార్షిక  ఆదాయ పన్ను మినహాయింపును రూ.5 లక్షలకు కాకపోయినా.. కనీసం రూ.3 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. మధ్యాదాయ వర్గాలకు ఊరటనివ్వడం కోసం పన్ను శ్లాబులను సైతం మెరుగుపరచే దిశగా ఆ శాఖ పనిచేస్తోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రభావం పడుతున్న వేతన జీవుల కోసం ఆ చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా.. వచ్చే నెల 1న ప్రకటించే తదుపరి బడ్జెట్లో రూ.5-10 లక్షల ఆదాయ వర్గాలకు 10%; రూ.10-20 లక్షల ఆదాయ వర్గాలకు 20%; రూ.20 లక్షల పైబడిన వారికి 30 శాతంగా పన్ను రేట్లను విధించొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.10-20 లక్షల ఆదాయ వర్గాలకు ఎటువంటి శ్లాబు లేదు. కాబట్టి ఇది జరగాలని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు.

2.ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్...

ఇక.. సాధారణ ప్రజలు బడ్జెట్ నుంచి ఆశిస్తున్నవాటిలో రెండోది ఇది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్  80సీలో భాగంగా పీఎఫ్‌, పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఎన్‌పీఎస్‌, పన్ను ఆదా ఫిక్స్‌ డ్‌ డిపాజిట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌, బీమాపాలసీలు, పిల్లల చదువులకు చెల్లించిన ఫీజులు, గృహరుణం అసలు తదితరాలన్నీ వస్తాయి. కాకపోతే ఈ సెక్షన్‌ కింద గరిష్ఠంగా రూ.1,50,000 మాత్రమే మినహాయింపు వర్తిస్తుంది. కాబట్టి దీనిని పెంచే అవకాశం ఉంది. ఇక వైద్య ఖర్చులు సెక్షన్ 80డీ కిందకు వస్తాయి. ప్రస్తుతం రూ. 15000 వరకు ఎంప్లాయర్ రీఎంబర్స్ చేసేందుకు గాను 1999లో ప్రత్యేక మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే గత 18 ఏళ్లలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో.. ఈ సెక్షన్ 80డీ పరిమితిని రూ. 2లక్షల 50వేల వరకు పెంచే అవకాశాలున్నాయి.

3.ఉద్యోగాలు...

ఈ బడ్జెట్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. యూఎన్ లేబర్ రిపోర్టు ప్రకారం.. దేశంలో 18మిలియన్ల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకోసమే ఎక్కువ మంది ఎదురుచూస్తున్నారు. కాబట్టి.. ఈ దిశగా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆశావాదులు భావిస్తున్నారు.

4.స్కిల్ డెవలప్ మెంట్..

ఉద్యోగాలు సాధించాలంటే.. అందుకు తగిన నైపుణ్యాలు కూడా చాలా అవసరం. ఇందుకోసమే 2015లో ప్రధాని నరేంద్రమోడీ.. స్కిల ఇండియాని కూడా లాంచ్ చేశారు. స్కిల్ ఇండియా పథకంలో భాగంగా 2002లోగా 40.22 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నామని కూడా చెప్పారు. అయితే.. అది ఆచరణకు నోచుకోలేదని ఇప్పటికే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కాబట్టి దీనిని కూడా బడ్జెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందని సమాచారం. దీని కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

5.కార్పొరేట్ ట్యాక్స్ అండ్ మ్యాట్ రేట్లలో కోత..

నాలుగేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తామంటూ బడ్జెట్ 2015లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఇది కార్యరూపం దాల్చలేదు. గత రెండు బడ్జెట్‌లలో రూ. 50 కోట్ల కంటే తక్కువ రెవెన్యూ గల కంపెనీలకు 25 శాతం కార్పొరేట్ ట్యాక్స్ విధించారు. దీన్ని కొనసాగిస్తూ.. మరిన్ని కంపెనీలకు ఈ ఎగ్జెంప్షన్స్ అందింవచ్చు.మ్యాట్ రేట్‌లో కూడా కోత విధించవచ్చని అంచనాలున్నాయి. దశల వారీగా మ్యాట్ ప్రొవిజన్స్‌ను సడలించవచ్చు. 

6.కనీస వేతనాల పెంపు...

లేబర్ మినిస్ట్రీ..2016లో కనీస వేతనాలను నెలకు రూ.9,100కు ఫిక్స్ చేసింది. ఒక కుటుంబానికి ఈ మొత్తాన్ని కనీస వేతనం అందాలని నిర్ణయించింది. కాగా.. ఇప్పుడు ఈ కనీస వేతనాలను మరింత పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న కనీస వేతనాన్ని రెట్టింపు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

7.జీఎస్టీ భారం తగ్గించాలి...

జీఎస్టీ( వస్తు సేవల పన్ను)..భారం తగ్గించాలని సాధారణ ప్రజలు ఆశిస్తున్నారు. సాధారణ ప్రజానీకంతోపాటు పలు పరిశ్రమలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న జీఎస్టీని తగ్గించాలని ఎక్కువ మంది భావిస్తున్నారు.

8.సొంతింటి కల..

సొంతిళ్లు నిర్మించుకోవాలనేది అందరి కల. అందుకే వారంతా ఇప్పుడు బడ్జెట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం జీఎస్‌టీ, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నాలుగు పన్నులు వేస్తున్నాయి. ఒకటే పన్ను ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పన్ను శాతం కూడా చాలా తగ్గాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios