Asianet News TeluguAsianet News Telugu

సరసానికి సరైన సమయం ఉండాలండోయ్...

  • సీజన్స్‌ కు అనుగుణంగా సెక్స్‌ కోరికలు కూడా మారుతుంటాయంట.
  • ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలు అబ్బాయిలు సెక్స్ కోర్కెలతో రెచ్చిపోతారని ఒక పరిశోధనలో తేలింది.
Winter has proven to be the healthiest season for sex

సీజన్స్‌ కు అనుగుణంగా సెక్స్‌ కోరికలు కూడా మారుతుంటాయంట. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలు అబ్బాయిలు సెక్స్ కోర్కెలతో రెచ్చిపోతారని ఒక పరిశోధనలో తేలింది. నిజం చెప్పాలంటే.. సెక్స్ కి అనువైన కాలం కూడా చలికాలమేనని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉన్నాయి. చలికాలంలో సెక్స్ చేయడం వల్ల కొన్ని రకాల జబ్బుల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఉందట. చలికాలంలో సెక్స్ కోరికలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? చలికాలంలో చేయడం వల్ల వచ్చే ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం..

శరీరాలు వేడిని కోరుకుంటాయి..

ఎండాకాలంలో చెమట ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరైనా తగిలితే చిరాకుగా ఉంటుంది. అదే చలికాలంలో వాతావరణమంతా చల్లగా ఉంటుంది. కాబట్టి శరీరం వేడిని కోరుకుంటుంది. కాబట్టి ఈ కాలంలో సెక్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేయగలరట.

జలుబు, ఫ్లూ..

చలికాలం వచ్చిందంటే చాలు చాలా మందికి జలుబు చేస్తుంటుంది. అవి తగ్గడానికి రకరకాల మందులు కూడా వాడుతుంటారు. అయితే.. ఈ కాలంలో సెక్స్ చేయడం వల్ల జలుబు, ఫ్లూ వంటి జబ్బులను తట్టుకోగలిగే రోగనిరోధక శక్తి శరీరంలో పెరుగుతుందట.

విటమిన్ డీ లోపం..

చలికాలంలో సూర్యుడి ఉదయం చాలా ఆలస్యంగా వస్తాడు.. సాయంత్రం చాలా త్వరగా వెళ్లిపోతాడు. ఎండ కనిపించే సమయం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల డీ-విటమిన్ ఆశించిన స్థాయిలో శరీరానికి చేరదు. దీని వల్ల బద్దకంగా, నీరసంగా ఉంటుంటారు. అయితే.. ఈ చలికాలంలో సెక్స్ చేయడం వల్ల ఈ బద్దకం తగ్గుతుందట. అంతేకాకుండా ఆక్సీటాసిన్, ఎండోర్ఫిన్స్ వంటి హార్మోన్స్ రీలీజ్ అయ్యి.. ఉత్తేజంగా మారడానికి సహాయం చేస్తుందట.

ప్రేమించుకోవడానికి బోలెడంత సమయం..

ఇతర కాలాలతో పోలిస్తే.. చలికాలంలో ఎక్కువగా ప్రేమించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇలాంటి సమయంలో హాలిడే ట్రిప్ కి వెళితే.. మీ ప్రేమించేవారికి మరింత దగ్గర అయ్యే అవకాశం లభిస్తుంది.

మహిళల్లో రుతు సమస్యలు తగ్గుముఖం..

ప్రతినెలా రుతుక్రమం సమయంలో స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. చలికాలంలో సెక్స్ చేయడం వల్ల వారికి ఆ సమస్య తగ్గుముఖం పడుతుందట. ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

సంతానాభివృద్ధికి సరైన సమయం..

పిల్లల్ని కనాలి అనుకునేవారికి కూడా చలికాలం అనుకూలమంటున్నారు నిపుణులు. ఎండాకాలంతో పోలిస్తే ఈ కాలంలో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లల్ని కనడం కూడా చాలా సులువు.

Follow Us:
Download App:
  • android
  • ios