Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ లో ఆ పప్పులు ఉడకవ్ సార్

ఉన్నట్లుండి ఢిల్లీ నుంచి అమరావతి దాకా డిజిట్ ట్రాన్సాక్షన్ అని ఒకటే గోల. డిజిటల్ ఎకానమీ అలా మీట నొక్కగానే పరుగుతీస్తుందా...

will digital transactions take off India

పాపం ప్రధాని మోడీ గారు "నగదు రహిత లావాదేవీలు" అనే ఒక ఆబ్సెషన్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయనకొస్తున్నవి కూడా డిజిట్ డ్రీమ్స్ నేమో ! క్యాష్ లెస్ ఎకానమీ - డిజిటల్ ట్రాంజాక్షన్స్ పై ఎక్కడ పడితే అక్కడ లెక్చర్లు దంచేస్తున్నారు. పైగా దాంతో నల్లధనాన్ని అరికడతాం అన్నారు. అవినీతి అంతం అరిచారు.  అదికాస్తా బెడిసి కొట్టేసరికి "లెస్ క్యాష్" అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 

 

అసలు "నగదు రహిత ఎకానమీ" సాధ్యమేనా ?? 

 

పూర్తి నగదురహిత లావాదేవీలు చేస్తున్న దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు... ప్రపంచంలో గొప్ప ఎకానమీలుగా చెప్పబడే దేశాల్లోకూడా ఎక్కువశాతం లావాదేవీలు ఇప్పటికీ "నగదు తోనే" జరుగుతున్నాయి.. కానీ దరిద్రంలో ఉన్న ప్రజలకు కడుపునిండా తిండి కూడా దొరికే పరిస్థితులు కల్పించలేని మన పాలకులు మాత్రం "నగదు రహితం - క్యాష్ లెస్" అంటూ పగటికలలు కంటూ, దాన్ని దేశభక్తికీ - నల్లధనానికీ ముడి పెట్టి, జనాలని మోసం చేస్తున్నారు.. సిగ్గుచేటు..!!

 

బ్లూమ్ బర్గ్ డాటా ప్రకారం, 

 

ఆస్ట్రేలియా - 65% నగదు లావాదేవీలు

ఆస్ట్రియా - 80% నగదు లావాదేవీలు

కెనడా - 53% నగదు లావాదేవీలు

ఫ్రాన్స్ - 55% నగదు లావాదేవీలు

నెదర్లాండ్స్ - 50% నగదు లావాదేవీలు

యూ‌ఎస్‌ఏ - 50% నగదు లావాదేవీలు

 

ఇప్పటికీ, అధికశాతం నగదుతోనే నడుస్తున్నాయి. 

 

అసలు పూర్తి నగదురహిత లావాదేవీలు అన్నవి ఉండనే ఉండకూడదు. పౌరులు చేసే ప్రతిఒక్క లావాదేవీ ప్రభుత్వానికి ఎందుకు తెలియాలి ?? నేను కట్ డ్రాయర్ కొనుక్కొన్నా అది కాష్ లెస్ తో చేసి, ప్రభుత్వానికి తెలియజేయాలా ??? పౌరులు "నగదు రహిత లావాదేవీలు మాత్రమే చేయాలి" అంటూ నిర్భందించే అధికారం - హక్కూ ఏ ప్రభుత్వాలకీ లేదు.

 

కేవలం "పెద్దమొత్తంలో చేసే లావాదేవీలు మాత్రమే డిజిటల్ మోడ్ లో చేయాలి" అన్న నిబంధన ఉంటే తప్పులేదు కానీ, ఉప్పు - పప్పు - చడ్డీ - బనియన్ లాంటివాటికి కూడా "కాష్ లెస్" అంటే అది పూర్తిగా మతిలేని ఆలోచన.

 

 "బ్లాక్ మనీని అరికట్టడానికే నాట్లను రద్దు చేస్తున్నాం" అంటూ మొదలు పెట్టిన మోడీ, ఇప్పుడేమో "క్యాష్ లెస్ - డిజిటల్ ట్రాంజాక్షన్స్" అంటున్నారు. 40రోజుల్లో లెక్కలేనన్ని వైరుధ్యమైన ప్రకటనలు చేశారు.

 

- అసలు బ్లాక్ మనీని క్యాష్ లెస్ ట్రాంజాక్షన్స్ తో అరికట్టడం సాధ్యమా ??? 

- బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు క్యాష్ లెస్ తో లావాదేవీలు చేస్తారా ???

- మొత్తం బ్లాక్ మనీలో కాష్ శాతం ఎంత ??? సముద్రంలో కాకి రెట్ట మాత్రమే కదా ???

 

..... మరి, ఆ కాకిరెట్టకోసం సముద్రంలోని నీళ్ళను తోడుతానని అంటున్నారు ఈ భగవాన్ మోడీ..!! - దీనివల్ల ఎవరికి నష్టం ?? ఇంతకంటే తలమాసిన ఐడియా ఉందా ?? అసలు చెప్పాలంటే, "క్యాష్ లెస్ ఎకానమీ" కోసం నోట్లను రద్దు చేయాల్సిన  అవసరమే లేదు. 

 

కాష్ రూపంలో ఉన్న నల్లధనం అన్నది కేవలం 1 నుండి 5% మాత్రమే అని ఒక అంచనా. అలాంటిది, నోట్లను రద్దుచేసి, దాన్ని నల్లధనాన్ని అరికట్టడానికి లింక్ చేసి, తీరా ఇప్పుడు డిజిటల్ ట్రాంజాక్షన్స్ చేయమని, దాన్ని నల్లధనానికి లింక్ చేస్తూ, పైగా లక్కీ లాటరీ అంటూ జనాలని వెధవలని చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. షుమారు 15 లక్షలకోట్ల కరెన్సీ మార్కెట్ లో ఉంది అని ప్రభుత్వం చెప్పింది. దాంట్లో ఇప్పటికే 14 లక్షల కోట్లు దాటి బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి.

 

అంటే మరో లక్ష కోట్లు గనక వచ్చి చేరితే, ఇక మార్కెట్ లో చలామణి లో ఉన్న నోట్లలో నల్లధనం ఏమాత్రమూ లేనట్లే. మరి నోట్లరద్దు వల్ల ప్రభుత్వం ఏం సాధించింది ??? ఇది సెల్ఫ్ గోల్ కాదా ?? తీరా ఇప్పుడు "కాష్ లెస్ - లెస్ కాష్" అంటూ జనాలని మోసం చేస్తూ ఉంది.. - అన్నిటికంటే పెద్ద జోక్ ఏమిటంటే, సాక్ష్యాత్తూ ఆర్థిక మంత్రే, సభసాక్షిగా, "నల్లధనం ఎంతుందో నాకే తెలీదు" అనిప్రకటించడం.. ఇది నిజంగా సిగ్గుచేటు..

.

... బేసిగ్గా చెప్పేదేమిటంటే, అయ్యవారిని చేయబోతే కోతిపిల్ల అయ్యింది అన్న సామెత ఈ ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుంది.. కొండ నాలుకకు మందు వేస్తున్నామని చెప్పి, ఉన్ననాలుకను కూడా ఊడబీకేశారు ఈ మతిలేని పాలకులు., ఏం చేస్తాం, వీళ్ళని ఎన్నుకొన్నందుకు అనుభవించాలి మరి.. ఖర్మ ఖర్మ..!!

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios