ప్రజలను భయపెడుతున్న ’డిసెంబర్ 21’

ప్రజలను భయపెడుతున్న ’డిసెంబర్ 21’

‘ డిసెంబర్ 21’ ఏంటి.. ప్రజలను భయపెట్టడం ఏమిటి  అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. రేపటి( గురువారం) రోజున ఏమి జరుగుతుందా అని చాలా మంది ఇప్పుడు భయపడుతున్నారు. రేపు ఏ పని మొదలుపెట్టాలన్నా.. ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు.ఇదంతా ఎందుకు అంటే.. 2017లో  అత్యంత ప్రమాదకరమైన రోజు డిసెంబర్ 21     అట. ఈ విషయం మేము చెబుతున్నది కాదు.. స్వయంగా జ్యోతిష్యులే చెబుతున్నారు.

రేపు ఏదైనా పని మొదలుపెడితే.. ఆ పూర్తి కాకపోగా.. లేనిపోని కష్టాలు వస్తాయంటున్నారు జ్యోతిష్యులు. దాని తాలూకు దరిద్రం ఈ ఏడాదితో పోగపోగా.. వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందట. అసలు విషయం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతితక్కువ పగటి కాలం డిసెంబర్ 21న నమోదుకానుంది. అంతేకాదు.. 350ఏళ్లలో మొదటిసారిగా సూర్యుడు, శని ఒకేరాశిలో రానున్నాయట. ఇది భూ ప్రళయానికి సంకేతమని నీల్ స్పెన్సర్ అనే జ్యోతిష్యుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రీస్తు శకం 1684 తర్వాత అలాంటి ఖగోళ మార్పు గురువారం సంభవిస్తుందని ఆయన వివరిస్తున్నారు.

వ్యక్తుల జాతకంలో శని మకరంలోకి ప్రవేశిస్తే లాభం జరుగుతుంది. కానీ ఖగోళపరంగా స్థూల స్థాయిలో ఇది ప్రమాదకరమని స్పెన్సర్ చెబుతున్నారు. అంతేకాదు గురువారం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని పలువురు జ్యోతిష్యులు కూడా సూచిస్తున్నారు. దీనిని కొందరు సీరియస్ గా తీసుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఇవన్నీ మూఢనమ్మకాలంటూ కొట్టిపారేస్తున్నారు. గతంలోనూ ఇదేమాదిరి వార్తలు రావడం గమనార్హం. అవి కూడా డిసెంబర్ నెలలోనే జరుగుతాయంటూ వార్తలు వెలువడ్డాయి. ఒకనొక సందర్భంలో అయితే.. ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందనే ప్రచారం కూడా జరిగింది. ఇది కూడా అలాంటి వార్తే అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page