భర్త మీద అనుమానంతో.. ఓ మహిళ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో.. అతనికి పెద్ద శిక్ష విధించింది ఆ భార్య. ఏకంగా అతని మర్మాంగానే కోసేసింది. ఈ దారుణ సంఘటన పంజాబ్ రాష్ట్రం జలంధర్ సింగ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆజాద్ సింగ్, శుక్వాంత్ కౌర్ అనే ఇద్దరు భార్యభర్తలు జలంధర్ సింగ్ పట్టణం జోగిందర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. ఆజాద్ సింగ్.. కొంతకాలంగా భార్యతో సఖ్యతగా మెలగడం లేదు. దీంతో.. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం శుక్వాంత్ కౌర్ కి కలిగింది. అంతే ఆవేశంతో ఊగిపోయింది. తనకు అన్యాయం చేస్తున్నాడనే భావన ఆమెకు కలిగింది. అంతే.. సోమవారం భర్త నిద్రిస్తున్న సమయంలో అతనిపై ఇనుప రాడ్ తో దాడి చేసింది.

తలకు దెబ్బతగిలి అతను అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. కత్తితో అతని మర్మాంగాలను కోసేసింది. అనంతరం వాటిని టాయ్ లెట్ లో పడేసి అక్కడి నుంచి పరారయ్యింది. ప్రస్తుతం ఆజాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పరారీలో ఉన్న శుక్వాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.