టీం ఇండియా క్రికెటర్ షమీ అక్రమ సంబంధాలు రట్టు

First Published 7, Mar 2018, 1:24 PM IST
wife accuses cricketer mohammed shami of assault and extramarital affair Shami calls it conspiracy
Highlights
  • ఇతర మహిళలతో షమీ వివాహేతర సంబంధం
  • ఫోటోలతో సహా బయట పెట్టిన భార్య

టీం ఇండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి.. పై ఆయన భార్య హనిస్ జహన్ సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త షమీ.. చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది. ఇందుకు తగిన సాక్ష్యాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆమె చెప్పింది. 

షమీ ఒక అమ్మాయితో దిగిన ఫోటో, ఛాటింగ్ లను స్క్రీన్ షాట్ చేసి మరీ ఫేస్ బుక్ లో పెట్టింది. దీంతో.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.గత రెండేళ్లుగా షమీ, ఆయన కుటుంబసభ్యులు తనని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు హనిస్ ఆరోపించారు.

ఒకరు, ఇద్దరు కాదు...  చాలా మంది అమ్మాయిలతో షమీకి అక్రమ సంబంధాలు ఉన్నాయన్నారు. తనను చంపేందుకు షమీ కుటుంబసభ్యులు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జనవరిలో షమీ భార్య ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇండియా-ఎ తరఫున దేవ్‌ధర్ ట్రోఫీలో ఆడుతున్న షమీ ప్రస్తుతం ధర్మశాలలో ఉన్నాడు.

 

 

loader