ఢిల్లీ యాత్రను చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసుకుని వచ్చారు. కెసిఆర్ లాగా ఆయన ప్రధాని కలవలేదు. టీ తాగలేదు.  హోంమంత్రిని కలిసి  వెనుదిగిరి వచ్చేశారు. ఎందుకు?

నిన్న ఢిల్లీలో రెండు ముఖ్యమయిన పరిణామాలు జరిగాయి. ఒకటి తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీరుబడిగా ప్రధాని నరేంద్రమోదీని కలుసుకున్నారు. రెండు ’అవినీతి పై పోరాటం’లో భాగంగానే నితీశ్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని ప్రధాని ప్రశసించారు. నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతు ఉంటుందని బిజెపి వాళ్ల చాలా కాలంతా చెబుతున్నారు. వాళ్ల మాట ప్రకారం జరిగింది.

అయితే, ఢిల్లీ యాత్రను చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసుకుని వచ్చారు. కెసిఆర్ లాగా ఆయన ప్రధాని కలవలేదు. హోంమంత్రిని కలిసి వచ్చేశారు. ఎందుకు?

పాలిటిక్సాడటంలో చంద్రబాబుకు చాలా అనుభవం ఉంది. పాలిటిక్స్ ని ఆయన చాలా దూరాన్నుంచే వాసన పసిగట్టి దానికి తగ్గట్టుగా మారి సమర్ధించుకుంటూ ప్రకటనలు చేస్తారు. ఈ విషయంలో ఆయన దిట్ట.ఫిరాయింపులను ఖండించగలరు, అటు తిరిగి సమర్థించగలరు. ఆంధ్ర కు ప్రత్యేక హోదాకావాలని చెప్పగలరు, హోదా కంటే ప్యాకేజీ పవిత్రమయిందని చెప్పగలరు. ఇలాంటి శక్తి ఉన్నందునే ఆయన ఢిల్లీ రాజకీయాల వాసన పసిగట్టారు. ఇక్కడేదో జరుగబోతున్నదని వూహించినట్లున్నారు. వెంటనే విజయవాడ విమానమెక్కారు. అక్కడేమో కెసిఆర్ శుభ్రంగా అందరితో కలసి, చల్లటి ఢిల్లీ చిత్తడి లో వేడివేడి చాయ్ సిప్ చేసి తనదై రాజకీయం చడీ చప్పుడు లేకుండా చేసుకుంటు పోయారు.

ఢిల్లీ వెళ్లి, పెండింగులో ఉన్న విషయాలను పబ్లిక్ కోసమయినా మాట్లాడాలని బాబు ఎందుకనుకోలేదు. ప్రధాని వూర్లోఉన్నా ఒక ఏకాంత సమావేశం కోర లేదు.

 ఎన్డీయేకి బాబు అవసరం తీరిపోతున్నదని రాజకీయ పండితులు చెబుతున్నారు. కెసిఆర్ దగ్గిరయ్యాక, నితిష్ స్నేహ హస్తం అందాక చంద్రబాబు అవసరమేమిటి?

ఇపుడు, ఎన్డీయే పాత మిత్రుడు చంద్రబాబు మీద అంత వెగటు ఎందుకొచ్చిందననే ప్రశ్న ఎదురువుతుంది.

చాలా మంది ట్వట్టర్ ఫాలోయర్లకు నితీశ్ రాజీనామా వార్త కంటే నితీశ్ కు అభినందనలు చెప్పుతూ చేసిన ప్రధాని ట్వీటే ముందు అందింది. నితీశ్ కుమార్ రాజీనామా అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న (తాను చేస్తున్న) పోరాటంలో భాగమవుతుందని ఆ్న అన్నారు. స్వాగతం అన్నారు. ఇది ఎన్డీయే లోకి స్వాగతం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో వోడిపోయినా, మోదీ బీహర్ ను ఎలా తన ఖాతాలో వేసుకుంటున్నారో చూడండి.

ఇదే అవినీతి కోణం లోనుంచే చంద్రబాబుని కూడా మోదీ చూసి వదులుకోవాలనుకుంటున్నారా?

అమరావతి అవినీతి గురించి ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నుంచి రాష్ట్రపతి దాకా డాక్యుమెంట్లను సమర్పించారు. ఢిల్లీలో పెద్ద క్యాంపెయినే చేశారు. అమరావతి చుట్టు ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’లో టిడిపి పెద్దోళ్లు భూములు కొన్న వివరాలు అందించారు. ఇంక కాంట్రాక్టుల వివరాలను కూడా అందించారు. బిజెపి వ్యవహారానికి వస్తే, విష్ణుకుమార్ రాజు వైజాగ్ భూముల కుంభకోణం వివరాలను కేంద్రానికి పంపించారు. చాలా మంది బిజెపి సీనియర్ నేతలు(కన్నా, పురందేశ్వరి, సోము వీర్రాజు వగైరా) రాష్ట్రంలో జరగుతున్న అవినీతి గురించి వివరాలన్నీ పంపించారు. మొన్నామధ్య విజయవాడకొచ్చినపుడు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మోసుకెళ్లిన పత్రాలన్నీ కూడా చంద్రబాబు అవినీతి గురించి న ఆరోపణలే నట.

అందు వల్ల ఇక చాలు, ఈ టిడిపి ప్రభుత్వం దూరంగా జరగడమే మేలని ప్రధాని మోదీ అనుకుంటున్నారా?