Asianet News TeluguAsianet News Telugu

పట్డుబడిన నోట్ల సమాచారం దాచడమెందుకు...

ఇరవై నాలుగ్గంటల్లో దొంగల్ని పట్టి పోలీసులు మీడియా ముందు నిలబెడుతుంటారు. కొత్త నోట్లను దారి మళ్లించిన వారిని పట్టి  ఐటి అధికారులు  ప్రజల ముందు పెట్టరెందుకు.

Why IT officials not revealing information of seized notes

వారం రోజుల కిందట మహబూబ్ నగర్ కొస్గిలో రెండు వర్గాల మధ్య ఉద్రికత్తకు తావిచ్చే సంఘటన జరిగింది.

 

ఒక వర్గం వారి ప్రార్థనాలయం మీద  ఒక అపవిత్ర దాడి జరిగింది.  పొద్దున అయిదు గంటలపుడు ఒక వర్గానికి చెందన వారు ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్ష ణాల్లో మహబూబ్ నగర్ పోలీసుల బలగాలను దించారు.

 

 ఉద్రేకంతో వూగిపోతున్న ఈ వర్గానికి చెందిన వారికి నచ్చ చెప్పారు. అవతలి వారితో మాట్లాడారు. అల్లర్లు సృష్లించే అవకాశం కోసం  ఎదురు చూస్తున్న వారి చేతిలో ఈ పరిస్థితి పడకుండా పోలీసు రంగంలో కి  దిగారు. ఎస్ పి రెమా రాజేశ్వరి  స్వయంగా పర్యవేక్షించారు. 24 గంటలలో ఈ అపవిత్ర దాడికి పూనుకున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. విలేకరుల సమాశంలో ప్రవేశపెట్టారు.

 

 ఐటి అధికారులు కొన్ని వందల కోట్ల  కొత్త రెండు వేల రుపాయల నోట్ల కట్టలను ప్రముఖుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. వాటి మీద నెంబర్లున్నాయి. అనెంబర్లను ఏ బ్యాంకుల కు కేటాయించారో రిజర్వు బ్యాంకు దగ్గిర సమాచారం ఉంది. ఆ  బ్యాంకు మేనేజర్ల, సిబ్బందిపేర్లు తెలుసు. ఒక లారీ లోడు  కొత్త రెండు వేల నోట్లను పట్టుకున్నపుడు ( ఉదా హరణకు  టిటిడి బోర్డు మెంబరు శేఖర్ రెడ్డి ఇంటిలో లాగా) 24 గంటల్లో  దోషులను అరెస్టు చేసి, వారిపేర్లను, బ్యాంకు పేరును, మేనేజర్ పేర్లతో సహా  మహబూబ్ నగర్ ఎస్ పి రెమా రాజేశ్వరి లాగా   ప్రపంచానికి ఎందుకు వెల్లడించడంలేదు?

 

 

గుజరాత్‌లోని సూరత్‌లో ఫైనాన్స్ వ్యాపారి వద్ద స్వాధీనం చేసుకున్న 1.05 కోట్ల విలువైన కొత్త నోట్లు దొరికాయి.  హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో 90 లక్షల విలువైన కొత్త నోట్ల కట్టలు దొరికాయి. చెన్నైలో టిటిడి బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసాల్లో, బెంగళూరులో దొరికిన కోట్ల కొద్దీ నగదు, బంగారం సంగతి చెప్పనవసరం లేదు.

 

పంజాబ్‌లో ముగ్గురు డ్రగ్ స్మ్లర్లనుంచి పోలీసులు 12 లక్షల విలువైన కొత్త 2 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.  నోయిడాలో శనివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రూ 18 లక్షోల విలువైన కొత్త కరెన్సీని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌కు బృందం ఒకటి స్వాధీనం చేసుకుంది.

 

సూరత్‌లోని మరొక  ఫైనాన్స్ వ్యాపారి నివాసం, కార్యాలయాలపై ఆదాయం పన్ను శాఖ అధికారులు రెండు మూడు రోజుల పాటు జరిపిన దాడుల్లో కోటీ 4 లక్షల విలువైన కొత్త నోట్లు పట్టుకున్నారు.

 

మన హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్‌ నుంచి, ట్యాంక్‌బండ్‌పై అనుమానస్పదంగా వెళ్తున్న మరొక కారులోంచి దాదాపు 94 లక్షల విలువైన కొత్త 2 వేల రూపాయల నోట్ల ను పట్టుకున్నారు.

 

ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లా దువ్వాడ జంక్షన్ సమీపంలోని పాలనూరులో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి 18.7 లక్షల రూపాయల విలువైన నగదును స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేశారు.


నగదులో అధిక భాగం కొత్త 2 వేల రూపాయలు నోట్లు.   ఈ నోట్లను ఏబ్యాంకుకు కేటాయించారో  వాటి సీరియల్ నంబర్ అధారంగా చెప్పవచ్చు.

 

  ఒక బ్యాంకు బయట క్యూలో  ప్రజలు, ముఖ్యంగా పెన్షనర్లు వేయి రుపాయాల కోసం పడిగాపులు కాసి, అలసి చనిపోతా ఉంటే, అదే బ్యాంకు నుంచి కోట్ల రుపాయలు బయటకు ఎలా వెళ్తన్నాయో చెప్పేందుకు రోజుల తరబడి దర్యాప్తు ఎందుకు?

 

  రెండు గంటల్లో అందరిని ఈడ్చుకొచ్చి మీడియా ముందు నిలబెట్ట వచ్చుగదా?

Follow Us:
Download App:
  • android
  • ios