చంద్రబాబుకి మరో షాకిచ్చిన ఆనం బ్రదర్స్

చంద్రబాబుకి మరో షాకిచ్చిన ఆనం బ్రదర్స్

ఆనం సోదరులు.. టీడీపీ ని వీడి వైసీపీలో చేరేందుకు పూర్తిగా సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి అడుగుపెట్టిన ఆనం బ్రదర్స్ కి ఇక్కడ ఊహించిన మర్యాద, ఆశించిన ప్రతిఫలం దక్కలేదు. దీంతో.. పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వెలువడ్డాయి.
కాగా.. తాజాగా ఆనం సోదరులు చేసిన ఓ పని ఈ వార్తలకు మరింత ఊతం ఇస్తోంది. ఇప్పటి వరకు వారి కార్యాలయాల్లో, తమ నివాసాల్లో ఉన్న చంద్రబాబు, టీడీపీ ఫోటోలను ఆనం సోదరులు తొలగించేశారు.  సడెన్ గా చంద్రబాబు ఫోటోలను తొలగించడంతో టీడీపీ నేతలు షాక్ కి గురయ్యారు. అప్పటి వరకు పార్టీ మారడం వట్టి పుకారు అని భావించిన వారంతా.. ఈ ఘటన తర్వాత పార్టీ మారడం ఖాయమనే నిర్ణయనికి వచ్చారు.

అంతేకాదు.. చంద్రబాబు ఆనం వివేకాని కలవడానికి ప్రయత్నిస్తే.. అందుకు ఆయన నిరాకరించడం గమనార్హం. ఆనం వివేకానంద రెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే..హాస్పటల్ కి వెళ్లి పరామర్శించడానికి చంద్రబాబు ప్రయత్నించగా.. వారి కుటుంబసభ్యులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక రామ్ నారాయణరెడ్డికి ఫోన్ చేస్తే.. ఆయన ఫోన్ విసిరికొట్టినట్లు సమాచారం.ఇదంతా వాళ్లు పార్టీ మారేందుకు సంకేతమని నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో వినబడుతూ ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page