వెండితెర అద్భుతం, అలనాటి అందాల తార శ్రీదేవి మరణం..యావత్ సినీ అభిమానులను కలచివేసింది. ఫిబ్రవరి 24వ తేదీన దుబాయిలోని ఓ హోటల్ లో కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. స్నానానికి అని బాత్రూమ్ కి వెళ్లిన ఆమె అక్కడే కుప్పకూలి మృతిచెందారు. అయితే.. అసలు  ఆమె బాత్రూమ్ లోనే ఎందుకు కుప్పకూలారు..? కేవలం ఒక్క శ్రీదేవి మాత్రమే కాదు.. చాలా మందికి  గుండెనొప్పి బాత్రూమ్ లోనే ఎందుకు వస్తోంది..? దీనికి వైద్యపరంగా కారణాలు ఉన్నాయంటున్నారు వైద్యనిపుణులు.

స్నానం చేసే విధానం కూడా ఇందుకు కారణమంటున్నారు. ‘‘చాలామంది స్నానం చేసేటప్పుడు ముందుగా త‌మ‌ త‌ల‌ను త‌డుపుకుంటారు. ఇంకొందరు షవర్ బాత్ చేస్తుంటారు. అది త‌ప్పుడు ప‌ద్ధ‌తి. అలా చేయ‌డం వ‌ల్ల వేడి ర‌క్తం గ‌ల‌ మాన‌వ శ‌రీరం ఒక్క‌సారిగా ఉష్ణోగ్ర‌త‌ను సాధారణ స్థాయికి తీసుకురాలేదు. ఉష్ణోగ్ర‌త‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించుకునే క్ర‌మంలో నీళ్లు ప‌డిన త‌ల భాగం వైపున‌కు ర‌క్త ప్ర‌స‌ర‌ణ ఒక్క‌సారిగా పెరుగుతుంది. దీంతో ర‌క్త‌నాళాల్లో ఎవైనా అడ్డంకులు ఉంటే గుండెపోటుకు కార‌ణ‌మ‌వుతాయి. ఈ కార‌ణంగా ఒక్కోసారి ప‌క్ష‌వాతం కూడా రావొచ్చు. అలా కాకుండా స్నానం చేసేట‌పుడు ముందుగా పాదాల నుంచి పైకి నీటిని వేసుకోవ‌డం మంచి ప‌ద్ధ‌తి. ముఖ్యంగా అధిక ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట్రాల్‌, మైగ్రేన్‌తో బాధ‌ప‌డుతున్నవారు స్నానం చేసేట‌పుడు ఈ ప‌ద్థతినే పాటించాలి’’ అని నిపుణులు చెబుతున్నారు.

శ్రీదేవి చనిపోవడానికి ముందు బంధువుల వివాహాంలో ఆట పాటలతో సందడి చేసింది. దీంతో ఆమె శరీరం బాగా అలసిపోయి ఉండి.. వెంటనే స్నానానికి వెళ్లడంతో ఇలా జరిగి ఉండొచ్చు అనే వాదన వినపడుతోంది.