ఎవరీ డేరా బాబా, ఏమా కథ?
రాజకీయంగా కూడా ఈయన బాగా పలుకుబడి ఉన్నవాడు. అన్ని పార్టీలకు ఆయన ఆశీస్సులున్నాయి. గతంలో కాంగ్రెస్ ఆయనకు జడ్ ప్లస్ క్యాటగరి భద్రతఅందించింది. 2014 లోొ మాత్రం బాబా బిజెపికి జై అన్నారు. బహుశా కలాశ్నికోవ్ తుపాకులు పట్టుకున్న భద్రతా సిబ్బందితో దర్శనమిచ్చే బాబా భారత దేశంలో డేరాబాబా ఒక్కరే నేమో.
యాభై యేళ్ల డేరాబాబా (ఆగస్టు 15,1967) దేశంలో చాలా పలుకుబడి ఉన్న బాబాల్లో ఒకరు. డేరా సచ్ సౌద అనే విశ్వాసమార్గాన్ని ప్రచారం చేసేందుకు పూనుకున్నాడు. ఇది 1990 సెప్టెంబర్ 23 న మొదలయింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం దేశంలోని 99 మంది చాలా ప్రాబల్యం ఉన్న బాబాలో ఈయన 96 స్థానంలో ఉన్నాడు. ఈ రిపోర్టు ప్రకారం ఆయనకు అయిదుకోట్ల మంది భక్తులున్నారు.
వేష భాషల్లో ఆయనక తళుకుబెళుకులెక్కువ. రాక్ స్టార్ల లాగా స్టయిలిష్ గా ఉంటాడు. అందుకే ఆయనను ఇండియన్ రాక్ బాబా అని కూడా పిలుస్తారు. ఆయనకు రంగు రంగుల వస్త్రాలంటే ఇష్టం. ఈ రంగులలో చిత్రవిచిత్రమయిన వేషధారణలోకనిపిస్తూ ఉంటారు. రాజస్థాన్ లో పుట్టిన గుర్మీత్ పెద్ద గా చదువుకోలేదు. ఆయన చదువు పదోతరగతి దాట లేదు. అయితే, ఆయన సచ్ సౌద సామ్రాజ్యంలో పదకొండుస్కూళ్లు, రెండు కాలేజీలు, ఒక మేనేజ్ మెంట్ ఇన్స స్టిట్యూట్ ఉన్నాయి. ఆయనకూడా షాంపులు, హెయిర్ అయిల్స్ తయారుచేయడం, ఆసుపత్రులను నడపుతూ ఉంది. ఆడతాడు, పాడతాడు, ఆడిస్తాడు, పాడిస్తాడు. నిజానికి బోధనలకంటే, ఆయనకు లైఫ్ స్టయిల్ బాగా ప్రచారం తీసుకువచ్చింది.
ఆయన ఆశ్రమంలో రకరకాల సేవలు లభిస్తాయి. హర్యానా సిర్సాలో ఉన్న విశాలమయిన ఆయన ఆశ్రమంలో చాక్ లెట్లు తయారుచేసే ఫ్యాక్టరీలు కూడా ఉన్నయి. ఆయనపేరు హర్యనా పంజాబ్ ఢిల్లీలో చెడామడా అస్తులు కూడబెట్టారు. భూములు కొన్నారు. నిజానికి ఇపుడు పతంజలి సీన్ ను డామినేట్ చేస్తున్నారు కాని, డేరాబాబా కూడా ఎంఎస్ జి బ్రాండ్ నేమ్ తో ఏన్నోరకాల సరుకులు తయారుచేసి విక్రయిస్తుంటారు. ఇందులో బ్యాటరీలు, దుస్తులు, తినుబండారాలు... ఇలా లేనివంటూ లేవు. ఆయనదెక్కువగా అన్ లైన్ వ్యవహారం. 9-9 షాంపూ,7- 7 హెయిర్ అయిల్ పాపులర్ అని చెబుతారు.
ప్రాబల్యానికి కారణం
పంజాబ్-హర్యానా లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాల పట్ల అగ్రకులాల పీడన చాలా ఎక్కువ. ఈ బాధితులను డేరా వర్గం అక్కున చేర్చుకుంది. వారికి బతుకు మీద భరోసానిచ్చింది. ఆహారం, వైద్యం విషయంలో వారికి తోడ్పాటును అందించింది. డేరాప్రాబల్యం పెరిగేందుకు ఈ విధానం బాగా దోహదపడింది. ఈ ప్రాబల్యంలో రాజకీయ పార్టీలు ఓట్లు చూశాయి. బాబాను ఆదరించాయి. ప్రభుత్వం నీడ కల్పించాయి.పంజాబ్-హర్యానా లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాల పట్ల అగ్రకులాల పీడన చాలా ఎక్కువ. ఈ బాధితులను డేరా వర్గం అక్కున చేర్చుకుంది. వారికి బతుకు మీద భరోసానిచ్చింది. ఆహారం, వైద్యం విషయంలో వారికి తోడ్పాటును అందించింది. డేరాప్రాబల్యం పెరిగేందుకు ఈ విధానం బాగా దోహదపడింది. ఈ ప్రాబల్యంలో రాజకీయ పార్టీలు ఓట్లు చూశాయి. బాబాను ఆదరించాయి. ప్రభుత్వం నీడ కల్పించాయి.
గత ఏడాది ఆయన నడుపుతున్న ఎంఎస్ జి ఆల్ ట్రేడింగ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ 151 వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేసింది. డేరా వెబ్ సైట్ అందించే వివరాల ప్రకారం సిర్సాలో ఒక ఆయుర్వేదిక్ సెంటర్, నాచురోపతి, మల్టి స్పెషాలిటి ఆసుపత్రి కూడా ఉన్నాయి. ఇదే విధంగా హర్యానా, మధ్యప్రదేశ్,రాజస్థాన్ లలో విద్యాసంస్థలున్నాయి.
ఈ బాబా అల్లాటప్పా బాబా కాదని ఈ వివరాలు చెబుతాయి. రాజకీయంగా కూడా ఈయన బాగా పలుకుబడి ఉన్నవాడే. అందుకే ఆయనకు జడ్ ప్లస్ క్యాటగరి భద్రత కూడా అందిస్తున్నారు. బహుశా కలాశ్నికోవ్ తుపాకులు పట్టుకున్న భద్రతా సిబ్బందితో దర్శనమిచ్చే బాబా భారత దేశంలో డేరాబాబా ఒక్కరే.
ఆయన కు చాలా చిన్నవయసులోనే పెళ్లయింది.పెళ్లయ్యే నాటికి ఆయనకు 23 సంవత్సరాలే. అయితే, అప్పటికే ఆయనకు డేరా తత్వం ఒంటపట్టింది. ఈ విషయంలో ఆయనకు షా సత్నామ్ సింగ్ మహరాజ్ గురువు. డేరా తత్వాన్ని అలవర్చకున్నాక, ఆయన సంసారబంధనాలు తెచ్చకున్నారు. డేరా రాజస్థాన్ లోని జాట్ సిక్కు కుటుంబం నుంచి వచ్చారు. రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ జిల్లాలోని గురుసార్ ఆయన సొంత వూరు.
అనుచరులు కోట్లలో ఉండటంతో రాజకీయనాయకులు కళ్లు ఆయన మీద పడ్డాయి. అన్ని రకాల రాజకీయ నాయకలు ఆయన ఆశీస్సుల కోసం రావడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎన్నికలపుడు ఆయన ఆశీస్సులు అవసరమయ్యేవి.ఒక దశలో ఆయనే రాజకీయ పార్టీ పెడతారనుకున్నారు. అయితే అలా జరగలేదుగాని, 2014లో ఆయన బహిరంగంగా భారతీయ జనతా పార్టీకి మద్ధతు పలికారు. డేరా బాబా ఆశీస్సులన్నందునే హర్యానాలో బిజెపి గెలిచిందని, మనోహర్ లాల్ ఖత్తర్ బిజెపి తరఫున ముఖ్యమంత్రి అయ్యారని కూడా ప్రచారం లో ఉంది. ఇపుడాయన బిజెపిని సమర్థిస్తున్నారు, గాని గతంలో కాంగ్రెస్ కు ఆయన ఆశీస్సులుండేవి. దీనికి బదులుగా కాంగ్రెసోళ్ల ప్రభుత్వం బాబాకు జడ్ ప్లస్ భద్రత అవసరమని ఫీలయింది. సమకూర్చింది.
సంఘ సేవ
ఆయన సంఘ సేవక విపరీతమయిన పేరొచ్చింది. రక్తదానాలు, నేత్రదాన కార్యక్రమాలు అమలుచేయడంలో, వ్యభిచారుల పునరావాసంలో,ప్రకృతి వైపరీత్యాలపుడు సహాయ చర్చలు చేపట్టడంలో ఆయన సంస్థ చాలా గినీస్ కెక్కింది. అయితే, ఇదే విధంగా ఆయనను రకరకాల నేరారోపణలు కూడా చుట్టు ముట్టాయి. శిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ అనుకరిస్తున్నాడని శిక్ పాంధిక్ సంస్థలు ఆయన యుద్ధం ప్రకటించారు. దీనితో రాడికల్ శిక్కులకు, డేరా సభ్యులకు మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంటఉ ఆయన్ను లేపేసే ప్రయత్నం కూడా జరిగింది.
మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండిCopy