జయలలిత వారసుడిపై ప్రతిష్టంభన పన్నీరు సెల్వంకు లభించని సంపూర్ణ మద్ధతు

‘అమ్మ’ వారసత్వంపై అప్పుడే ఏఐఏడిఎంకే లో వార్ మొదలైంది. ఇప్పటి వరకు జయలలిత తర్వాత పన్నీర్ సెల్వం ఇప్పటి వరకు అనధికార వారసుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన వారసత్వం లాంఛనప్రాయమే అని అందరూ అనుకుంటున్నారు.

అయితే సోమవారం రాత్రి జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో జయ విశ్వాసపాత్రుడు పన్నీరు సెల్వంకు పూర్తి స్థాయిలో మద్దతు దక్కలేదని తెలిసింది.

అమ్మ వారసుడిని ఎంపిక చేసేందుకు మళ్లీ సమావేశం కావాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. మధ్యాహ్నం సమావేశమైన ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంను తమ నాయకుడిగా అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై పార్టీ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. 

మరోవైపు సినీ హీరో అజిత్ పార్టీ పగ్గాలు చేపడుతారని తమిళనాట ఆయన అభిమానులు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇవే రూమర్లు వినిపిస్తున్నాయి.