మార్చి8వ తేదీ.. అంతర్జాతీయ మహిళల దినోత్సవం. మానవ జీవితంలో మహిళల గొప్పతనాన్ని తెలియజేసేందుకు.. ప్రత్యేకంగా ఉమెన్స్ డేని ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం ఒక రోజు కేటాయించి వారికి గౌరవాన్ని కల్పించారు. కొన్ని కార్యాలయాలు అయితే.. ఏకంగా మహిళా ఉద్యోగులకు సెలవలు ప్రకటించాయి. ఇక సెలబ్రెటీల నుంచి  సామాన్యుల వరకు తమ జీవితంలో ముఖ్యపాత్ర పోషించిన మహిళలను పొగుడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరి కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేక రోజు ఉండాలా..? మేము మాత్రం ఏం తక్కువ..? మాకెందుకు ప్రత్యేకమైన రోజు ఎందుకు ఉండకూడదు అనే అబ్బాయిలు చాలా మందే ఉన్నారు. అయితే.. ఉమెన్స్ డేలాగానే మెన్స్ డే కూడా ఉంది. కాకపోతే.. మనదేశంలో దీనిని ఎక్కువగా ఎవరూ సెలబ్రేట్ చేసుకోకపోవడం వల్ల దీని గురించి తెలియడం లేదు. ఇంతకీ మెన్స్ ఎప్పుడో తెలుసా.. నవంబర్ 19. మనదేశంలో కాదు కానీ.. దాదాపు 70 ఇతర దేశాలు మెన్స్ డేని అట్టహాసంగా జరుపుకుంటారు.

 ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఒక ఈవెంట్ క్రియేట్ చేసుకొని మరీ మెన్స్ డే జరుపుకుంటున్నారు. మెన్స్ డే కోసం ఈ ఏడాది థీమ్‌ను పాజిటివ్ మేల్ రోల్ మాడల్స్ అని క్రియేట్ చేశారు. ఓ ఆదర్శ పురుషుడిని ఆదర్శంగా తీసుకుని పిల్లలు ఎదగాలని మెన్స్ డే ఆర్గనైజర్లు తెలిపారు. ఇంటర్నేషనల్ మెన్స్‌డే కోసం ప్రత్యేక వెబ్‌సైట్(http://www.internationalmensday.com/) ఉంది. పురుషుల, అబ్బాయిల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఆ సైట్‌లో ఆర్గనైజర్లు కోరారు. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలను బలపరచడం, లింగ సమానత్వం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. 1960 నుంచి మెన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.