ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ త్వరలో మరో అద్భుతమైన ఫీచర్ ని తీసుకురానుంది. ఇటీవలే వాట్సాప్ లో పేమెంట్స్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవల యూజర్లను విసిగిస్తున్న స్పామ్ మెసేజ్ లకు అడ్డుకట్ట వేసేందుకు మరో ఫీచర్ తీసుకువస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. అదే ''ఫార్వర్డెడ్ మెసేజ్‌'' అనే ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా వేరే వ్యక్తులు స్పామ్‌ మెసేజ్‌ను ఫార్వర్డ్‌  చేసినా లేదా ఒక చాట్‌ నుంచి ఒక మెసేజ్.. చాలా మందికి ఫార్వర్డ్ అయినా..ఈ ఫీచర్ కనిపెట్టేస్తుంది. వెంటనే ఆ మెసేజ్ దగ్గర 'ఫార్వర్డెడ్‌ మెసేజ్‌' అనే టాగ్‌ వచ్చేస్తోంది. దీనివల్ల యూజర్లు అది నిజమైన మెసేజ్ అవునో కాదో తెలుసుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్ చెబుతోంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వర్షన్ లో కనిపిస్తోంది. త్వరలోనే దీనిని అధికారికంగా తీసుకురానున్నారు. దీనితోపాటు మరికొన్ని ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ చూస్తోంది.