వాట్సాప్ సంచలన నిర్ణయం.. ఆ ఫోన్ల లో  ఇక నో ‘‘వాట్సాప్’’

వాట్సాప్ సంచలన నిర్ణయం.. ఆ ఫోన్ల లో  ఇక నో ‘‘వాట్సాప్’’

కొందరు వాట్సాప్ వినియోగదారులకు ఇది నిజంగా చెడువార్తే. ఎందుకంటే.. ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31వ తేదీ నుంచి కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.  ఈ విషయాన్ని వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది. పాత సాఫ్ట్ వేర్ లతో నడుస్తున్న స్మార్ట్ ఫోన్లలో తమ వాట్సాప్ పనిచేయడదని కంపెనీ తెలిపింది.

బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10, విండోస్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పనిచేస్తున్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. ఇప్పటికే కొన్ని నోకియా ఫోన్లలో ఈ ఏడాది జూన్ నుంచి వాట్సాప్ పనిచేయడం ఆగిపోయింది.  కాగా.. నూతన సంవత్సరంలో మరికొన్ని ఫోన్ల నుంచి కూడా తొలగించనున్నట్లు ప్రకటించింది. నూతన సంవత్సరానికి మరో వారం రోజులు మాత్రమే ఉన్న సమయంలో  వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకోంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తున్న ఫోన్లలో సైతం వాట్సాప్ ను తొలగించనున్నట్లు ప్రకటించింది. కాకపోతే.. ఈ ఫోన్లకు మాత్రం 2020 ఫిబ్రవరి 1వ తేదీ వరకు గడువు విధించింది.

కాబట్టి.. మీరు కనుక బ్లాక్ బెర్రీ 10, విండోస్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్స్ గల ఫోన్లను వాడుతున్నట్లయితే.. మీరు కొత్త ఫోన్లను కొనుగోలు చేసుకోవాలి లేదంటే.. ఆపరరేటింగ్ సిస్టమ్ అప్ గ్రేడ్ అవ్వాలి. లేకపోతే వాట్సాప్ ని వదులుకోవాల్సి వస్తుంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos